వాగులు, వంకలు దాటి.. ఓటు వేయించి

మంచిర్యాల జిల్లా పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని వేమనపల్లి మండలంలో ఆరు గ్రామాల్లోని ఏడుగురు వయోవృద్ధులతో ఆదివారం మండుటెండలో ఇంటి నుంచి ఓటు వేసే ప్రక్రియను అధికారులు పూర్తిచేశారు.

Published : 06 May 2024 03:11 IST

మంచిర్యాల జిల్లా పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని వేమనపల్లి మండలంలో ఆరు గ్రామాల్లోని ఏడుగురు వయోవృద్ధులతో ఆదివారం మండుటెండలో ఇంటి నుంచి ఓటు వేసే ప్రక్రియను అధికారులు పూర్తిచేశారు. జిల్లా యంత్రాంగం వారికి వాహనాన్ని ఏర్పాటు చేసింది. వాగులు, వంకలు దాటాల్సి రావడంతో అధికారులు, సిబ్బందికి పాట్లు తప్పలేదు. చామనపల్లి గ్రామంలో 95 ఏళ్ల వృద్ధురాలితో ఓటు వేయించేందుకు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ గ్రామానికి రహదారి సౌకర్యం లేదు. బద్దంపల్లి గ్రామం వరకు ఎన్నికల సిబ్బంది కారులో సామగ్రితో వెళ్లారు. వాగు దాటేందుకు మరో వాహనం కావాల్సి వచ్చింది. కొంత దూరం నడిచి అక్కడి నుంచి ఓ వాహనం, ట్రాక్టర్‌ సాయంతో ఎట్టకేలకు వృద్ధురాలి ఇంటికి చేరుకొని ఓటింగ్‌ ప్రక్రియ ముగించారు. కార్యక్రమంలో పీవో పోకల వెంకటేశ్వర్లు, ఓపీవో కుమార్‌తోపాటు ఇతర పోలింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

న్యూస్‌టుడే-మంచిర్యాల విద్యావిభాగం, వేమనపల్లి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని