కనీస వేతనం రూ.30 వేలు ఉండాలి

ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కనీస వేతనం రూ.30 వేలు, గరిష్ఠ వేతనం రూ.2,48,150, ఫిట్‌మెంట్‌ 30 శాతంతో కొత్త పీఆర్‌సీని ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (టీఎస్‌యూటీఎఫ్‌) శివశంకర్‌ను కోరింది.

Published : 08 May 2024 03:59 IST

పీఆర్‌సీ ఛైర్మన్‌ను కోరిన టీఎస్‌యూటీఎఫ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కనీస వేతనం రూ.30 వేలు, గరిష్ఠ వేతనం రూ.2,48,150, ఫిట్‌మెంట్‌ 30 శాతంతో కొత్త పీఆర్‌సీని ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (టీఎస్‌యూటీఎఫ్‌) శివశంకర్‌ను కోరింది. వర్తమాన సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు గౌరవప్రదంగా జీవించడానికి అవసరమైన జీతభత్యాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.జంగయ్య, చావరవి ఇతర నేతలు లక్ష్మారెడ్డి, వెంకట్‌, రాజశేఖర్‌రెడ్డి, పి.మాణిక్‌రెడ్డి మంగళవారం శివశంకర్‌కు ఈ మేరకు తమ ప్రతిపాదనలు సమర్పించారు. గత పీఆర్‌సీ నివేదిక 30 నెలలు ఆలస్యంగా ఇవ్వడం వల్ల ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోయారని, ఈసారి 01.07.2023 నుంచి ఆర్థిక ప్రయోజనం వర్తింపజేయాలని కోరారు. అన్ని జిల్లాలకు డీఈఓలు, మండలాలకు ఎంఈఓలు, పాఠశాలలకు ప్రధానోపాధ్యాయ పోస్టులు మంజూరు చేయాలని అభ్యర్థించారు.


గరిష్ఠవేతనం రూ.3,41,300 ఉండాలి: ఎస్టీయూటీఎస్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో ఉపాధ్యాయులు, ఉద్యోగులకు కనిష్ఠ వేతనం రూ.32 వేలు, గరిష్ఠ వేతనం రూ.3,41,300 ఉండాలని ఎస్టీయూటీఎస్‌ సంఘం శివశంకర్‌ను కోరింది. సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఎం.పర్వత్‌రెడ్డి, జి.సదానందంగౌడ్‌ ఇతర నేతలు సదయ్య, గజేందర్‌, దయానంద్‌, పోల్‌రెడ్డి తదితరులు మంగళవారం శివశంకర్‌ను కలిసి తమ ప్రతిపాదనలు సమర్పించారు. 40 శాతం ఫిట్‌మెంట్‌, 3 శాతం వార్షిక ఇంక్రిమెంట్‌, గ్రాట్యుటీ రూ.24 లక్షలు, మూల వేతనం పెంపు, ప్రోత్సాహకాలు ఇవ్వాలని విన్నవించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని