AstraZeneca: గిరాకీ తగ్గింది.. టీకాను మార్కెట్‌ నుంచి వెనక్కు తీసుకుంటున్నాం: ఆస్ట్రాజెనెకా

AstraZeneca: గిరాకీ తగ్గిన నేపథ్యంలో తమ కొవిడ్‌ వ్యాక్సిన్‌ను మార్కెట్‌ నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు ఆస్ట్రాజెనెకా ప్రకటించింది.

Updated : 08 May 2024 10:06 IST

దిల్లీ: తాము ఉత్పత్తి చేసిన కొవిడ్‌-19 వ్యాక్సిన్లను మార్కెట్‌ నుంచి వెనక్కు తీసుకుంటున్నట్టు ఆస్ట్రాజెనెకా (AstraZeneca) ప్రకటించింది. మార్కెట్‌లో అప్‌డేటెడ్‌ టీకాలు పెద్ద సంఖ్యలో అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తమ వ్యాక్సిన్‌ వ్యాక్స్‌జెవ్రియాకు గిరాకీ తగ్గిందని పేర్కొంది. ఇప్పటికే దీని తయారీ, పంపిణీని నిలిపివేసినట్లు వెల్లడించింది.

ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంతో కలిసి ఆస్ట్రాజెనెకా కొవిడ్‌ వ్యాక్సిన్‌ను (Covid Vaccine) అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ టీకాపై న్యాయస్థానాల్లో విచారణ జరుగుతోంది. దీని వల్ల దుష్ర్పభావాలు తలెత్తినట్లు పలువురు కోర్టును ఆశ్రయించారు. దీనిపై వివరణ ఇచ్చిన ఆస్ట్రాజెనెకా తమ వ్యాక్సిన్‌ వల్ల చాలా అరుదుగా సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండొచ్చని తెలిపింది. ఈ తరుణంలో వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని