USA: అమెరికాలో అరుదైన ‘ఫైర్నాడో’..!

అగ్నికి వాయువు తోడైతే ఎలా ఉంటుందో అమెరికాలో ఫైర్నాడో చూపించింది. సుడులు తిరుగుతున్న నిప్పు ఆ ప్రాంతాన్ని కమ్మేసింది.  

Published : 03 Sep 2023 15:44 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అసలే కార్చిచ్చు.. ఆపై సుడి గాలితో కలిసి భగభగలాడే అగ్నిగోళం వలే ఆ ప్రాంతాన్ని చుట్టేస్తే.. ఇలాంటి దృశ్యమే అమెరికా(USA)లోని లూసియానాలో ఆవిష్కృతమైంది. ఇక్కడ సబినే పారిష్‌ అనే ప్రదేశంలో కార్చిచ్చుతో టోర్నడో కలిసి.. అత్యంత అరుదుగా కనిపించే ఫైర్నాడోగా మారింది. అంతే వేగంగా చుట్టుపక్కల ప్రాంతాలకు కదులుతూ చూపరులను వణికించేసింది. కొద్దిసేపటి తర్వాత మెల్లగా బలహీనపడింది. ఈ దృశ్యాన్ని కొందరు చిత్రీకరించారు. 

బురదమయంగా మారిన ఎడారి.. చిక్కుకుపోయిన 70 వేల మంది..!

లూసియానా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫిషరీస్‌ కమిషనర్‌ మైక్‌ స్ట్రైన్‌ మాట్లాడుతూ లూసియానాలో వ్యాపిస్తున్న కార్చిచ్చులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి స్థానికులకు పెనుముప్పుగా మారాయన్నారు. దీనికి తోడు ఇటీవల కాలంలో చాలా మందిని కార్చిచ్చులను దగ్గర చూసేందుకు ప్రయత్నించడమో.. డ్రోన్లను పంపడమో చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమని వెల్లడించారు. ‘‘మా విమానాలు అక్కడ పనిచేస్తుంటాయి.. ప్రజలు అదే మార్గంలో డ్రోన్లను పంపిస్తున్నారు’’ అని పేర్కొన్నారు. 

మరోవైపు టెక్సస్‌లోని హంట్స్‌వెల్లీ కార్చిచ్చు భీకరంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే అక్కడ 3,000 ఎకరాలు కాలిపోయాయి. ఇక్కడ రోజుకు సగటున 100 ఎకరాల అడవి దగ్ధమవుతోంది. స్థానికులను అక్కడి నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని