బెలారస్‌లోకి వాగ్నర్‌ ముఠా

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అధికారాన్ని సవాల్‌ చేస్తూ.. గత నెలలో తిరుగుబాటు చేసిన వాగ్నర్‌ ముఠా శనివారం బెలారస్‌లోకి చేరుకుంది.

Published : 16 Jul 2023 04:45 IST

మిన్స్క్‌: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అధికారాన్ని సవాల్‌ చేస్తూ.. గత నెలలో తిరుగుబాటు చేసిన వాగ్నర్‌ ముఠా శనివారం బెలారస్‌లోకి చేరుకుంది. దాదాపు 60 వాహనాలతో ఆ గ్రూప్‌ సైనికులు బెలారస్‌వైపు వెళుతున్న దృశ్యాలు కనిపించాయి. ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యా సైన్యంతో కలిసి పోరాటం చేసిన ప్రిగోజిన్‌ నేతృత్వంలోని వాగ్నర్‌ ముఠా...అనూహ్యంగా గత నెల తిరుగుబాటు చేసింది. పుతిన్‌కు సన్నిహితుడైన బెలారస్‌ అధ్యక్షుడు లుకషెంకో రంగంలోకి దిగి..వారిని శాంతింపచేశారు. దీంతో మాస్కోకి 200 కిలోమీటర్ల దూరంలో వాగ్నర్‌ సేనలు ఆగిపోయాయి. ఆ సమయంలో వాగ్నర్‌ ముఠాకు.. రష్యా సైన్యంలోకి చేరడం లేదా బెలారస్‌కు వెళ్లి తలదాచుకొనే అవకాశమిచ్చారు. సైన్యంలో చేరడానికి ప్రిగోజిన్‌ నిరాకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు