మా దేశం విడిచి వెళ్లిపోండి

అఫ్గానిస్థాన్‌ నుంచి శరణు కోరి వచ్చే వారిపై పాకిస్థాన్‌ కఠిన వైఖరి అవలంబిస్తోంది. అనుమతి లేకుండా వచ్చినవారు వెంటనే తమ దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది.

Published : 05 Oct 2023 04:16 IST

17 లక్షల మంది అఫ్గాన్‌ వాసులకు పాకిస్థాన్‌ హుకుం

ఇంటర్నెట్‌ డెస్క్‌: అఫ్గానిస్థాన్‌ నుంచి శరణు కోరి వచ్చే వారిపై పాకిస్థాన్‌ కఠిన వైఖరి అవలంబిస్తోంది. అనుమతి లేకుండా వచ్చినవారు వెంటనే తమ దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. లేదంటే తరిమేస్తామని హెచ్చరించింది. ఇలా అఫ్గాన్‌ నుంచి శరణార్థులుగా వచ్చినవారు దాదాపు 17లక్షల మందికి పైగా ఉన్నట్లు సమాచారం. వీరందరినీ దేశం నుంచి పంపించేందుకు పాకిస్థాన్‌ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అఫ్గాన్‌ 2021లో తాలిబన్ల చేతిలోకి వెళ్లాక అనేక మంది పాకిస్థాన్‌కు శరణార్థులుగా వచ్చారు. ఐరాస నివేదిక ప్రకారం.. దాదాపు 13 లక్షల మంది అఫ్గాన్‌ పౌరులు శరణార్థులుగా నమోదు చేసుకున్నారు. మరో 8.8 లక్షల మంది శరణార్థులుగా ధ్రువీకరణ పొందారు. వీరుకాక మరో 17 లక్షల మంది అక్రమంగా తమ దేశంలోకి చొరబడ్డారని పాకిస్థాన్‌ అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రి సర్ఫరాజ్‌ బుగిటి ఇటీవల పేర్కొన్నారు. వీరందరూ ఈ నవంబరు 1వ తేదీ నాటికి దేశం విడిచిపోవాలని ఆదేశించారు. లేదంటే భద్రతా బలగాల సహాయంతో వారిని గుర్తించి బలవంతంగా పంపేస్తామని తెలిపారు. నవంబరు తర్వాత పాస్‌పోర్టు, వీసా లేకుండా దేశంలోకి ఎవరినీ అనుమతించబోమని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని