ఇజ్రాయెల్‌లో మంకీపాక్స్‌ తొలి కేసు

ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకర మంకీపాక్స్‌ కేసులు పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఇజ్రాయెల్‌లో ఈ తరహా తొలి కేసు నమోదైంది. ఇటీవలే విదేశాల నుంచి తిరిగొచ్చిన ఓ వ్యక్తిలో మంకీపాక్స్‌ను గుర్తించినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ

Published : 23 May 2022 04:46 IST

స్విట్జర్లాండ్‌లోనూ బయటపడ్డ వ్యాధి

టెల్‌ అవీవ్‌: ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకర మంకీపాక్స్‌ కేసులు పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఇజ్రాయెల్‌లో ఈ తరహా తొలి కేసు నమోదైంది. ఇటీవలే విదేశాల నుంచి తిరిగొచ్చిన ఓ వ్యక్తిలో మంకీపాక్స్‌ను గుర్తించినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మరికొందరిలోనూ వ్యాధి లక్షణాలు కనిపిస్తుండటంతో వారికి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. పశ్చిమాసియాలో మంకీపాక్స్‌ తొలి కేసు ఇదే కావడం గమనార్హం. మరోవైపు- స్విట్జర్లాండ్‌లోనూ ఓ వ్యక్తి ఈ వ్యాధి బారిన పడినట్లు తాజాగా నిర్ధారణ అయింది. ఇప్పటికే బ్రిటన్‌, స్పెయిన్‌, పోర్చుగల్‌, ఇటలీ, అమెరికా, స్వీడన్‌, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, బెల్జియం, ఆస్ట్రేలియాల్లో మంకీపాక్స్‌ కేసులు బయటపడ్డాయి. 

* పలు దేశాల్లో మంకీపాక్స్‌ కేసులు వెలుగుచూడటంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. తమ దేశంలో ఈ వ్యాధి వ్యాప్తి తీవ్రతపై ప్రస్తుతానికి స్పష్టత లేదని.. అయితే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆదివారం దక్షిణ కొరియాలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని