Ukraine Crisis: యూకే నుంచి ఉక్రెయిన్‌కు దీర్ఘశ్రేణి క్షిపణులు..!

ఉక్రెయిన్‌కు సాయంగా యూకే నుంచి దీర్ఘశ్రేణి రాకెట్‌ లాంఛర్లు పంపుతోంది. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణ మంత్రి బెన్‌వాలెస్‌ ధ్రువీకరించారు. తొలివిడత లాంగ్‌రేంజి ఎం270 మల్టిపుల్‌ రాకెట్‌

Published : 06 Jun 2022 13:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌కు సాయంగా దీర్ఘశ్రేణి రాకెట్‌ లాంఛర్లను యూకే పంపుతోంది. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణ మంత్రి బెన్‌వాలెస్‌ ధ్రువీకరించారు. తొలివిడత లాంగ్‌రేంజి ఎం270 మల్టిపుల్‌ రాకెట్‌ వ్యవస్థలను ఉక్రెయిన్‌కు అందజేస్తున్నామన్నారు. ఆ దేశ ఆత్మరక్షణకు ఈ ఆయుధం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

మొత్తం ఎన్ని వ్యవస్థలను పంపిస్తోందో మాత్రం వెల్లడించలేదు. ప్రాథమిక సమాచారం మేరకు తొలుత మూడు రాకెట్‌ వ్యవస్థలు వెళ్లనున్నట్లు ఆ దేశ పత్రికల్లో వార్తలొస్తున్నాయి. అమెరికాతో సమన్వయం చేసుకొంటూ ఈ నిర్ణయం తీసుకొన్నట్లు పేర్కొంది. అమెరికా కూడా వీటిని ఉక్రెయిన్‌కు అందించనున్నట్లు గత వారం వెల్లడించింది. ఉక్రెయిన్‌ సైన్యంలోని కొందరికి ఈ రాకెట్ల వినియోగంపై శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు పేర్కొంది. మారుతున్న వ్యూహాలకు అనుగుణంగా ఉక్రెయిన్‌కు మద్దతు చాలా అవసరమని బెన్‌ వాలెస్‌ పేర్కొన్నారు.

ఇప్పటికే ఎం270 రాకెట్లు ఇస్తామన్న అమెరికాపై రష్యా  ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆదివారం తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఉక్రెయిన్‌లో రష్యా కొత్త లక్ష్యాలను ఎంచుకొని దాడులను తీవ్రం చేస్తుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని