YS Sharmila: 400 రోజులు.. 4 వేల కిలోమీటర్లు

ప్రధానాంశాలు

YS Sharmila: 400 రోజులు.. 4 వేల కిలోమీటర్లు

రేపటి నుంచి షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర

ఈనాడు, హైదరాబాద్‌- చేవెళ్ల, న్యూస్‌టుడే: వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల రాష్ట్రంలో ప్రజాప్రస్థానం పాదయాత్రను ఈ నెల 20వ తేదీన చేవెళ్ల మండలం శంకరపల్లి క్రాస్‌ నుంచి ప్రారంభిస్తున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి తూడి దేవేందర్‌రెడ్డి తెలిపారు. 400 రోజులపాటు జరిగే పాదయాత్ర 90 శాసనసభ నియోజకవర్గాల్లో 4 వేల కిలోమీటర్ల మేర సాగుతుందన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉదయం   8.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మళ్లీ 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పాదయాత్ర ఉంటుందని చెప్పారు. ప్రతి మంగళవారం పాదయాత్ర ఎక్కడ ఉంటే అక్కడ నిరుద్యోగ నిరాహార దీక్ష ఉంటుందన్నారు. 20న ఉదయం 11 గంటలకు చేవెళ్లలో బహిరంగ సభ నిర్వహించి అనంతరం పాదయాత్ర ప్రారంభిస్తారని వైతెపా చేవెళ్ల పార్లమెంటు కన్వీనర్‌ కొండా రాఘవరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని