పిల్లలు మాట వినాలంటే...
close
Updated : 19/07/2021 01:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పిల్లలు మాట వినాలంటే...

టీనేజీలో పిల్లలు...అన్నీ మాకు తెలుసంటంటుంటే అమ్మానాన్నలకు ఎక్కడలేని కోపం వచ్చేస్తుంది. వారు తమని లెక్కచేయడం లేదని వాపోతుంటారు. అలాంటప్పుడు పదే పదే వారిని హెచ్చరించినా, అదుపులో పెట్టాలని చూసినా మొదటికే మోసం వస్తుంది. అలాకాకుండా మీరు ఓర్పుగా, నేర్పుగా ఈ చిట్కాలు పాటించి చూడండి.

కంగారొద్దు... ‘నాకు తెలుసు. నాకేం చెప్పొద్దు’ అనేది మీ ఒక్కరి పిల్లలే కాదు. ఆ వయసు వారందరిలోనూ అలాంటి తత్వమే కనిపిస్తుంది. కాబట్టి, మొదట మీరు చేయాల్సింది కంగారు పడొద్దు. వీలైతే వారేం చేస్తున్నారో ఎలా చేస్తున్నారో గమనించండి. ఒకసారి విఫలమైతే...రెండోసారి వారూ జాగ్రత్త పడతారు. ఆ నిర్ణయం వల్ల ఎదురైన పర్యవసానాలను చెబితే భవిష్యత్తులో ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోరు.  బదులుగా మీరే గాభరా పడిపోతుంటే సమస్య మరింత చిక్కుముడి పడుతుంది.

అన్నీ మీరే చేయాలనుకోవద్దు..: చిన్నారులు ఎదుగుతుంటే...వారితో పాటూ వారి ఆలోచనలూ పెరుగుతాయి.  ఇలాంటప్పుడు వారి ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వడం, అభిప్రాయాలను మన్నించడం వంటివి చేయండి. అలాకాకుండా నీకేం తెలియదంటూ, నీకిదే బాగుంటుందంటూ...బొమ్మరిల్లు సినిమాలో నాన్నలా అన్నీ మీరే చేసేయొద్దు. అప్పుడే పిల్లలు తమ ఆలోచనల్ని, అభిప్రాయాల్నీ మీతో పంచుకుంటారు.

క్లాసులు వద్దు... టీనేజీలో ఉన్నవాళ్లకు అతినియంత్రణ అస్సలు నచ్చదు. మీరు కూడా...వారు మరీ పసివాళ్లు కాదనే విషయం గుర్తించాలి. ఒకే విషయం గురించి పదే పదే చెప్పడం, వారి లోపాలను ఎత్తి చూపించడం చేస్తే ‘రోజూ ఇదే సుత్తి’ అనుకుంటారు. మీ దగ్గర కంటే బయట ఎక్కువ టైం గడపడానికి ఇష్టపడతారు. దాంతో మరిన్ని కొత్త సమస్యలు రావొచ్చు.  ఇవన్నీ కొన్ని పరిష్కార మార్గాలు మాత్రమే. వ్యక్తికి, వ్యక్తికి మధ్య సమస్యలు భిన్నంగా ఉండొచ్చు. అలాంటిది ఏదైనా కనిపిస్తే, ఇది సాధారణం కాదు. అసాధారణంగా అనిపిస్తే పిల్లలను డాక్టర్‌ దగ్గరకు తీసుకుని వెళ్లడంలో తప్పేం లేదు.


మరిన్ని

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని