పది రూపాయలకే భోజనం!
close
Updated : 27/03/2021 00:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పది రూపాయలకే భోజనం!

వరలక్ష్మి ఏడోనెల గర్భిణి... ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కోసం ఏలేశ్వరం నుంచి కాకినాడ వచ్చింది. బస్సు ఛార్జీల కోసం తెచ్చుకున్న రెండొందలూ అయిపోగా చేతిలో పదిరూపాయలు మిగిలాయి. ఆ డబ్బుకే కడుపు నిండేలా భోజనం వడ్డించారు ‘ఫలహారశాల’ మహిళలు. కాకినాడలోని జీజీహెచ్‌కు వచ్చే వేల మంది పేదలకు తక్కువ ధరకే భోజనం అందిస్తున్నారు ‘ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ ట్రస్ట్‌’ మహిళా సభ్యులు...
భయగోదావరి జిల్లాల ఆరోగ్య ప్రదాయనిగా ఉన్న జీజీహెచ్‌కు రోజుకు మూడు వేలమందికి పైగా రోగులు వస్తుంటారు. వీళ్లలో ఎక్కువ మంది పేదలే. బయట హోటళ్లలో భోజనం చేస్తే వీళ్ల జేబులు ఖాళీ అవ్వాల్సిందే. అటువంటి వారి కోసం పది రూపాయలకే మంచి భోజనం అందించే ప్రయత్నం చేస్తున్నారు ‘ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ ట్రస్ట్‌’కు చెందిన పదిమంది మహిళలు. అలాగని వాళ్లంతా డబ్బున్నవాళ్లు అనుకుంటే పొరపాటు. వాళ్లూ సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారే. వంటింటికే పరిమితం కాకుండా ఏదొక వ్యాపకం ఉండాలని ఏడాది క్రితం ఈ ట్రస్టులో సభ్యులుగా చేరారు. అక్కడే వంటల తయారీలో శిక్షణ పొందారు. ఆపై సేవా దృక్పథంతో కూడిన వ్యాపారం చేయాలని అనుకున్నారు. అలా స్థానిక జీజీహెచ్‌ ఆసుపత్రి ఎదురుగా ‘ఫలహారశాల’ పేరుతో ఓ దుకాణాన్ని ఏర్పాటు చేసి పదిరూపాయలకే అన్నం వడ్డిస్తున్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ఈ ట్రస్ట్‌ని నెలకొల్పారు ఈ సంస్థ ఛైర్మన్‌ సత్య. ‘మా దగ్గర నేర్చుకున్న వాళ్లల్లో కొందరు ఇంటివద్దే హోటళ్లు, దుకాణాలు పెట్టుకున్నారు. ఇంకొందరు కరోనా సమయంలో వంటలు వండి నిరాశ్రయుల కడుపునింపారు. ఆ సమయంలో ఎంతోమంది పేదలు ఆకలితో అల్లాడటం చూశాక తమ సేవని కొనసాగించాలని అనుకున్నారు. అలా ఈ తక్కువ ధరకే భోజనం అందించే కార్యక్రమం మొదలయ్యింది’ అంటారు సత్య. ప్రస్తుతం ‘ఫలహార శాల’ రోజుకు 300 నుంచి 500 మందికి భోజనాలు అందిస్తోంది. పదిరూపాయలకు టీకూడా రాదుకదా వీళ్లేం పెడతారులే అనుకుంటే పొరపాటు. రోగులకోసం ప్రత్యేకంగా జావ, మిరియాల చారు వంటి పథ్యం భోజనం దొరుకుతుంది. పెరుగన్నం, పులిహోర, చికెన్‌ బిర్యానీ వంటివి వీళ్లు అందించే మెనూలో ఉంటాయి.


మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని