Mahesh babu: మహేశ్‌ జుట్టులాగి ఆటపట్టించిన మంజుల.. క్యూట్‌ మొమెంట్స్‌ వైరల్‌..

ఓ పెళ్లి వేడుకకు మహేశ్‌బాబు హాజరుకాగా, ఆయన సోదరి మంజుల ఆటపట్టించారు.

Published : 29 Apr 2024 12:37 IST

అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు (Mahesh Babu) కనిపిస్తే చాలు సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు అందరూ తెగ ఆసక్తి చూపిస్తారు. తాజాగా ఓ వేడుకకు హాజరైన ఆయనను సరదాగా ఆటపట్టించారు మహేశ్‌ సోదరి మంజుల. హైదరాబాద్‌లో జరిగిన ఓ పెళ్లి వేడుకకు కుటుంబ సమేతంగా వెళ్లగా, ఆ కార్యక్రమానికి వచ్చిన మంజుల నేరుగా మహేశ్‌బాబు దగ్గరకు వెళ్లారు. వెంటనే ఆయన జుట్టు పట్టుకుని లాగడం, అందుకు మహేశ్‌ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలోని పాత్ర కోసం మహేశ్‌ ప్రత్యేకంగా మేకోవర్‌ అవుతున్నారు. అందులో భాగంగానే పొడవాటి జుట్టును పెంచుతున్నారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఆ క్యూట్‌ మొమెంట్స్‌ మీరూ చూసేయండి

Tags :

మరిన్ని