NTR - USA: ప్రఖ్యాత న్యూయార్క్ టైం స్క్వేర్‌పై.. ఎన్టీఆర్‌ చిత్రరాజాలు

యుగపురుషుడు ఎన్టీఆర్‌ (NTR) చిత్ర రాజాలను.. అమెరికాలోని ప్రఖ్యాత ‘న్యూయార్క్ టైం స్క్వేర్ (New York Time Square)’పై ప్రదర్శించారు. ఆ మహనీయుడి శతజయంతి సందర్భంగా.. NRI తెలుగుదేశం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. 200 అడుగులు ఎత్తు, 36 అడుగుల వెడల్పుతో ఉండే ఎన్టీఆర్‌ చిత్రరాజాలను.. అమెరికా కాలమానం ప్రకారం మే 27న అర్ధరాత్రి నుంచి మే 28 అర్ధరాత్రి వరకు ప్రతి 4 నిమిషాలకు ఒకసారి 15 సెకన్ల పాటు ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా టైం స్క్వేర్ వద్దకు భారీఎత్తున చేరుకున్న తెలుగుదేశం నాయకులు, అన్నగారి అభిమానులు.. జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు.

Updated : 28 May 2023 16:14 IST

Tags :