Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్కౌంటర్.. 12 మంది మావోయిస్టుల మృతి!
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్ జిల్లాలో భద్రతాబలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు.
రాయ్‌పుర్: ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లో మావోయిస్టులకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. బీజాపుర్ (Bijapur) జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో దాదాపు 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగలూర్ పోలీస్‌స్టేషన్ పరిధి పిడియా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు శుక్రవారం యాంటీ-నక్సల్స్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలోనే ఇరుపక్షాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఘటనా స్థలం నుంచి 12 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, భద్రత సిబ్బంది సురక్షితంగా ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
పాక్‌లోని ‘సోనల్’ కోసం.. సైనిక సమాచారం లీక్ చేసిన ఇంజినీర్..!
ఈ ఆపరేషన్ విజయవంతం కావడంపై ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ భద్రత బలగాలను అభినందించారు. ఇదిలా ఉండగా.. గత నెల 16న కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఛత్తీస్‌గఢ్ చరిత్రలో అతిపెద్ద ఎదురుకాల్పుల ఘటన ఇది. అనంతరం ఏప్రిల్ 30న నారాయణ్‌పుర్, కాంకేర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో మరో ఎన్కౌంటర్లో మరో 10 మంది మరణించారు. రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతంలో ఈ ఏడాదిలో ఇప్పటివరకు జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో మొత్తం 103 మంది మావోయిస్టులు మరణించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదో విడతలో జోరెవరిదో!
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ దేశంలో మరో దశ పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల ఐదో విడతలో భాగంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు సోమవారం ఓటింగ్ జరగనుంది. -
మాలీవాల్ ఎడమకాలు, కుడిచెంపపై గాయాలు
ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై దాడి కేసులో వైద్య నివేదిక కీలకంగా మారింది. దిల్లీలోని ఎయిమ్స్‌లో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. -
సీఐఎస్ఎఫ్ చేతికి పార్లమెంటు భద్రత
పార్లమెంటు భవన సముదాయం భద్రత బాధ్యతలను ఇక నుంచి కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం (సీఐఎస్ఎఫ్) నిర్వహించనుంది. -
ఠాణె న్యాయవాదికి దొరికిన వందేళ్లనాటి తీర్పు కాపీ
మహారాష్ట్రలోని ఠాణెలో ఓ న్యాయవాదికి మామిడి పండ్ల దొంగతనానికి సంబంధించిన కేసులో వందేళ్ల కిందట ఠాణె న్యాయస్థానం వెలువరించిన తీర్పు కాపీ దొరికింది. -
ఎయిర్ ఇండియా విమానంలో మంటలు
బెంగళూరు నుంచి కొచ్చి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో మంటలు రేగాయి. -
అత్యంత పొట్టి మహిళతో ‘ది గ్రేట్ ఖలీ’ ముచ్చట్లు
‘ది గ్రేట్ ఖలీ’గా పేరుపొందిన వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) స్టార్ దలీప్ సింగ్ రానా.. ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా రికార్డు సృష్టించిన జ్యోతి అమ్గేని ఇటీవల కలిశారు. -
పుదుచ్చేరి బీచ్‌లో సముద్ర స్నానానికి దిగిన తెలుగు యువకులకు వినూత్న దండన
చూసేందుకు ఎంతో అందంగా కనిపించే పుదుచ్చేరి సముద్ర తీరం గడిచిన ఐదేళ్లలో 60 మందిని బలితీసుకుంది. అక్కడి ప్రభుత్వం ఆ బీచ్‌లో స్నానాలు నిషేధించింది. -
అన్నం పెట్టడం లేదు.. ఇంటి నుంచి గెంటేశారు
రాజస్థాన్‌లోని భరత్‌పుర్ రాజకుటుంబంలో మళ్లీ రగడ మొదలైంది. తన భార్య, మాజీ ఎంపీ దివ్యా సింగ్, తనయుడు అనిరుధ్ తనని వేధిస్తున్నారంటూ మాజీ రాష్ట్ర మంత్రి విశ్వేంద్ర సింగ్ (62) వాపోయారు. -
డ్రిల్లింగ్ యంత్రం రాడ్డు తగిలి రైలు ప్రయాణికులకు గాయాలు
ఛత్తీస్‌గఢ్ రాజధాని నగరం రాయ్‌పుర్ శివారులో ఆదివారం ఉదయం కదులుతున్న రైలుకు భారీ డ్రిల్లింగ్ యంత్రం రాడ్డు తగలడంతో ఇద్దరు ప్రయాణికులతోపాటు పారిశుధ్య సిబ్బంది ఒకరు గాయపడినట్లు రైల్వే పీఆర్వో తెలిపారు. -
విశ్వ మానవులం!
ప్రపంచంలో ఏ మూలన ఉన్నాసరే, ఇతరులపైన బాగా ఆధారపడాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. గతంలో స్థానిక వ్యక్తులు, సమస్యల గురించే ఆలోచించాల్సి వచ్చేది. కానీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు మనందరి మీదా ప్రభావం చూపుతాయి. -
రాజకీయాలకు మేం అతీతం
సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు లబ్ధి చేకూర్చేలా రాష్ట్రంలోని ప్రముఖ మఠాలకు చెందిన సాధువులు వ్యవహరిస్తున్నారన్న పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపణలపై ఆధ్యాత్మిక సంస్థలు ఆదివారం స్పందించాయి. -
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
మధ్యప్రదేశ్‌లో ఓ పులి మళ్లీ దాడి చేసే అవకాశం ఉండటంతో అప్రమత్తమైన అధికారులు.. దాన్ని బంధించేందుకు ముమ్మర చర్యలు చేపట్టారు. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
తాజా వార్తలు (Latest News)
-
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం
-
కొనసాగుతోన్న ఐదో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది: ఎన్టీఆర్ గురించి ఈ సంగతులు తెలుసా?
-
మల్లారెడ్డి ఆస్తులపై విచారణ కోరతాం: ప్రభుత్వ విప్ లక్ష్మణ్‌కుమార్
-
ఒక్కోసారి ‘వన్ పర్సెంట్’ ఛాన్స్ ఉన్నా చాలు..: విరాట్ కోహ్లీ
-
ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!