Sun, February 07, 2016

Type in English and Give Space to Convert to Telugu

'కడలి వేదికగా కదన విన్యాసం''కల్తీల నుంచి కాపాడాలి''ఎస్సై కొలువులకు సై''వాట్సన్‌ @ రూ. 9.5 కోట్లు''హామీలు నెరవేర్చే వరకు దీక్ష''అన్నయ్యే వారసుడు..''ప్రజల మనసులు చూరగొంటూ..''సాగర జలాల్లో స్నేహబంధం''కాగిత రహిత టికెట్ల దిశగా రైల్వే''అనుమతి లేకుండా ప్రాజెక్టులు'
బర్మా ఉగ్రవాది హైదరాబాద్‌లో అరెస్టు
శరణార్థిగా వచ్చి ఇక్కడ మకాం
జాతీయ దర్యాప్తు సంస్థకు చిక్కిన ఉగ్రవాది ఖలీద్‌
ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న బురుద్వాన్‌ పేలుడు కేసు దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌.ఐ.ఎ.) అధికారులు బంగ్లాదేశ్‌ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న ఖలీద్‌ (28)ను సోమవారం అరెస్టు చేశారు. బర్మా దేశానికి చెందిన ఖలీద్‌ నుంచి ల్యాప్‌టాప్‌తోపాటు పలు కీలక ఉత్తరాలను, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బాంబులు తయారు చేయడంలో ప్రావీణ్యం ఉన్న ఖలీద్‌ సంవత్సరకాలంగా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. అతడి అరెస్టుతో హైదరాబాద్‌ పోలీసులు మరొక్కమారు ఉలిక్కిపడ్డారు.

బర్మాలోని అరకన్‌ రాష్ట్రానికి చెందిన ఖలీద్‌ ఫార్మసీ చదువుకున్నాడు. తల్లి హమీదా సనం, భార్య సమీరాతో కలిసి గత ఏడాది నవంబరులో బంగ్లాదేశ్‌ వద్ద సరిహద్దులు దాటి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. శరణార్థుల కోసం పనిచేస్తున్న ‘కోవా’ సంస్థలో ముగ్గురు వివరాలు నమోదు చేసుకున్నారు. బాలాపూర్‌ చౌరస్తాలోని రాయల్‌ కాలనీలో అప్పటి నుంచి నివాసముంటున్నాడు. వారం రోజుల క్రితం జీవనోపాధి కావాలంటూ ఐక్యరాజ్యసమితికి ఇక్కడి నుంచే ఈ-మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్నాడు. పాతబస్తీలోని ‘కోవా’ స్వచ్ఛంద సేవాసంస్థలో ఇతడికి సంబంధించిన వివరాలున్నాయి. మూడు రోజుల క్రితం తాను ఖలీద్‌తో మాట్లాడానని, అతడు ఉగ్రవాది అన్న భావన నాకు కలగలేదని ‘కోవా’ సమన్వయ కర్త నసీర్‌ సిద్ధిఖీ చెప్పారు.

బాంబుల తయారీలో నిష్ణాతుడు: ఉగ్రవాద శిక్షణలో ఉన్నప్పుడు ఖలీద్‌ బాంబులు తయారు చేయడంలో నైపుణ్యం సంపాదించాడు. మార్కెట్‌లో దొరికే పేలుడు పదార్థాలను ఉపయోగించి బాంబులు తయారు చేయడం ఎలా అన్నదానిపై ఖలీద్‌కు మంచి అవగాహన ఉంది. అలాగే సామూహిక హత్యలకు పాల్పడేందుకు విషపూరిత పదార్థాలను తయారు చేయడం ఎలా అన్నదానిపైనా శిక్షణ పొందాడు. అరబిక్‌ అధ్యాపకుడిగా పనిచేస్తున్న ఖలీద్‌ ఇక్కడ యువతకు కూడా ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నాడా? అన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ల్యాప్‌టాప్‌లో ఉగ్రవాదులకు సందేశాలు: పిల్లలకు పాఠాలు చెప్పే ఖలీద్‌కు ఓ ల్యాప్‌టాప్‌ ఉంది. దీని ద్వారా తరచూ ఉగ్రవాదులకు కోడ్‌భాషలో సందేశాలు పంపేవాడని తెలుస్తోంది. అయితే కుటుంబసభ్యులకు ఏమాత్రం అనుమానం రాకుండా జాగ్రత్తపడ్డాడు. ఖలీద్‌ తల్లి మాట్లాడుతూ.. బర్మా దేశంలోని రాయిమోర్‌బిల్‌, మంగూర్‌ ప్రాంతానికి చెందిన తాము అక్కడ ఉన్న రెండెకరాల స్థలం విక్రయించి హైదరాబాద్‌కు వలస వచ్చామని చెప్పింది.

వెలుగు వైపు నా అడుగులు...

బడిగంట కొట్టగానే పిల్లలందరూ బిలబిలమంటూ బయటకు పరుగుతీశారు. టీచర్లూ ఇంటిదారిపట్టారు. ఒకరిద్దరు తప్ప నిర్మానుష్యంగా మారిన ఆ బడిలో..

పరిశ్రమ వదిలి వెళ్లిపోదామనుకున్నా!

మానవీయ కోణాల్ని స్పృశిస్తూ సినిమాలు తీయడంలో దర్శకుడు మదన్‌ది ప్రత్యేక శైలి. మనిషి, మనసు, అనుబంధాల మధ్య సంఘర్షణల్ని ఆయన తెరపైకి తీసుకొచ్చే విధానం బాగుంటుంది.

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net