icon icon icon
icon icon icon

ఆరోజే కేఏ పాల్ పార్టీకి టాటా చెప్పా: మాజీ మంత్రి బాబూమోహన్‌

మాజీ మంత్రి, సినీనటుడు బాబూమోహన్‌ వరంగల్‌ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు.

Updated : 26 Apr 2024 08:36 IST

ఈనాడు, వరంగల్‌: మాజీ మంత్రి, సినీనటుడు బాబూమోహన్‌ వరంగల్‌ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. మధ్యాహ్నం వరంగల్‌ రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి చేరుకున్న ఆయన నడుము నొప్పితో ఇబ్బంది పడగా.. సిబ్బంది వీల్‌ఛైర్‌ ఏర్పాటు చేసి లోనికి పంపారు. రిటర్నింగ్‌ అధికారి ప్రావీణ్యకు నామినేషన్‌ పత్రాలు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కేఏ పాల్‌ ప్రజాశాంతి పార్టీ నుంచి నామినేషన్‌ వేస్తారనే ప్రచారం జరిగిందని విలేకరుల ప్రశ్నకు బదులిస్తూ.. కేఏ పాల్‌ కాఫీకి రమ్మంటే వెళ్లానని, అక్కడ పాల్‌ తనకు కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారని చెప్పారు. తాను ఎలాంటి పార్టీ సభ్యత్వం తీసుకోలేదని, అదే రోజు ఆ పార్టీకి టాటా చెప్పానని తెలిపారు. వరంగల్‌లో కొందరు అభిమానుల కోరిక మేరకు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశానని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img