Tue, February 09, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఔషధనగరిలో ప్రపంచశ్రేణి విశ్వవిద్యాలయం''భూసేకరణ, పునరావాసాలకేరూ. 8,000 కోట్లు''నెట్‌ సమానత్వానికే ట్రాయ్‌ మొగ్గు!''ముద్రగడ దీక్ష విరమణ''తెలంగాణ ప్రణాళిక భేష్‌''విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయాలా?''డాక్టర్‌.. ధనాధన్‌..''రసాయన పరిశ్రమలో పేలుడు''నడి వీధిలో పైశాచికం''పాక్‌ నుంచే కుట్ర'
ఈ దెబ్బ అరటిపండు కాదు
చిన్నపిల్లలకు ఆటల్లో దెబ్బ తగిలితే.. ‘ఆటల్లో దెబ్బ అరటిపండు’ అని మాయ చేస్తుంటాం. కానీ ఆ అరటిపండే ఉన్నట్టుండి ఫిలిప్‌ హ్యూస్‌ పాలిట పెనుశాపం అయ్యింది!

డుతూ.. ఆడుతూనే.. ఏమాత్రం ప్రమాదకరంగా అనిపించని ఓ సాదాసీదా బంతి దెబ్బకు గురై.. ఉన్నట్టుండి మైదానంలోనే కుప్పకూలి మళ్లీ కోలుకోలేకపోయిన 25 ఏళ్ల ఆస్ట్రేలియా క్రీడాకారుడు హ్యూస్‌ మరణం.. క్రీడాభిమానులనే కాదు.. యావత్‌ ప్రపంచాన్నే దిగ్భ్రాంతికి గురిచేసింది. క్రికెట్‌ ఆడుతూ ఇలా మరణించటం ఏమిటి? క్రికెట్‌లో ఇలాంటి ప్రమాదాలు కూడా ఉంటాయా? ఈ ప్రశ్నలు ప్రతి ఒక్కరినీ విస్మయపరుస్తున్నాయి. చిత్రమేమంటే ఈ బంతి మెడకు తగిలిన తీరు, ఆ తర్వాతి పరిణామాలు వైద్యరంగాన్ని కూడా అంతే విస్మయానికి గురి చేస్తున్నాయి. క్రికెట్‌లోనే కాదు.. సాధారణంగా చూసుకున్నా కూడా ఇది అత్యంత అరుదైన ఘటన. వైద్య చరిత్రలో ఇలాంటి ఘటనలు పట్టుమని వంద కూడా లేవు. క్రికెట్‌ చరిత్రలో అయితే బహుశా ఇది రెండోది కావచ్చంటున్నారు.

తలకు కాదు.. మెడకు!
హ్యూస్‌ ఎదుర్కొన్నది వేగంగా దూసుకొచ్చిన బంతినే అయినా.. అతని తలకు ఏ గాయమూ కాలేదు. బౌన్సర్‌ను తప్పించుకునే క్రమంలో బంతి వచ్చి హ్యూస్‌ మెడకు గట్టిగా తగిలింది. సరిగ్గా దాని కిందే మెదడుకు రక్తాన్ని తీసుకువెళ్లే కీలకమైన ధమని (వెర్టిబ్రల్‌ ఆర్ట్రీ) ఉంది. బలంగా తగిలిన దెబ్బకు.. ఒక్కసారిగా ఆ ధమని నొక్కుకుపోయి.. లోపలే చిటుక్కున చిట్లిపోయింది. వెంటనే రక్తం ఉరకలెత్తుతూ పైకి వెళ్లి, మెదడు మొత్తాన్నీ రక్తంతో నింపేసింది. సాధారణంగా మెడకు బలమైన దెబ్బ తగిలినా ఇది దెబ్బతినటం అరుదు. ఇది కాస్త లోపలగా ఉంటుంది, పైగా మెడ పూసల్లోపలికి వెళ్లివస్తుంటుంది. (బొమ్మలో చూడొచ్చు). ఒకవేళ రోడ్డు ప్రమాదాల్లోనూ, మెడను పిసకటం వంటివి చేసిన సందర్భాల్లోనూ దీని మీద ఒత్తిడి పడినా ఇదంత తేలికగా చిట్లదు. బాగా నొక్కుకుని, దీనిలోపల రక్తం గడ్డకట్టి.. మెదడుకు రక్తసరఫరా తగ్గటం వంటి సమస్యలు ఎదురవుతాయి. సరైన చికిత్స చేస్తే.. వీళ్లలో చాలామంది ప్రాణప్రమాదం నుంచి తేలికగానే బయటపడతారు కూడా. కానీ హ్యూస్‌కు మాత్రం దెబ్బ తగులుతూనే ఈ వెర్టిబ్రల్‌ ధమని చిట్లిపోయింది. దీంతో రక్తం కట్టలు తెంచుకుని.. మెదడును రక్తంలో ముంచెత్తింది. దీంతో హ్యూస్‌.. ఒక్క నిమిషం నిలబడినట్టే నిలబడి, మెల్లగా కిందికి ఒరిగిపోయాడు.

తక్షణం వైద్యులు మైదానంలోనే ప్రధమ చికిత్స అందించి.. శ్వాస ఆగిపోకుండా చూస్తూ ఆంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. మెదడులో చాలా రక్తం చేరిపోవటం, ఆ ప్రవాహం ఆగకపోతుండటంతో మెదడుపై ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. సాధారణంగా మెదడు చుట్టూ కొద్దిగా రక్తం చేరితేనే రోగి మగతగా అయిపోతారు. రక్తం ఎక్కువైతే స్పృహ కోల్పోతారు. ఇటువంటి సందర్భాల్లో మెదడుపై ఒత్తిడి పెరగకుండా చూడటం చాలా ముఖ్యం. అందుకే ఒత్తిడి తగ్గించేందుకు తక్షణం వైద్యులు పుర్రెను కొంత భాగం తెరిచి.. మెదడు నొక్కుకుపోకుండా.. దాని మీద ఒత్తిడి తగ్గేలా చేశారు. దీనివల్ల దెబ్బ మూలంగా మెదడు బాగా వాచినా.. పుర్రె ఎముకలో కొంత ఖాళీ దొరుకుతుంది కాబట్టి మెదడుకు నొక్కుకుపోయే ప్రమాదం ఉండదు. దాదాపు గంటా ఇరవై నిమిషాలు పట్టిన ఈ సర్జరీ బాగానే జరిగిందిగానీ.. దురదృష్టవశాత్తూ హ్యూస్‌ మళ్లీ స్పృహలోకి రానేలేదు. ఈ నేపథ్యంలో క్రికెట్‌ క్రీడాకారులు రక్షణగా ధరించే హెల్మెట్‌ నమూనాలను, ఇతర రక్షణ పద్ధతుల గురించి ఆలోచించటం, లోపాలేమైనా ఉంటే చక్కదిద్దుకోవటం మంచిదేగానీ.. ఇలా మెడకు దెబ్బ తగిలి దుర్మరణం పాలవటమన్నది మాత్రం చాలాచాలా అరుదని వైద్యులు వ్యాఖ్యానిస్తున్నారు.

బంతి దెబ్బ తగిలింది మెడకు కాబట్టి హ్యూస్‌ పెట్టుకున్న హెల్మెట్‌ దాన్ని ఆపలేకపోయింది. హెల్మెట్‌లో ఎలాంటి లోపం లేకపోయినా దాన్ని తయారు చేసిన మసూరి కంపెనీ హ్యూస్‌ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అసలా బంతి ఎటు నుంచి వచ్చి హ్యూస్‌కు ఎలా తగిలిందన్నది ప్రస్తుతం తమ నిపుణులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు కంపెనీ ప్రకటన విడుదల చేసింది. నిజానికి హ్యూస్‌ పెట్టుకున్నది 2013లో విడుదలైన టెస్ట్‌ మోడల్‌ హెల్మెట్‌. దీనికి ఉండే గ్రిల్‌- ముఖం మీద, తల వెనక భాగంలో కొంత వరకే రక్షణ నిస్తుంది. అంతకు మించి గ్రిల్‌ కిందికి ఉంటే మెడ, తల స్వేచ్ఛగా అటూఇటూ కదపలేరు. దీన్ని దృష్టిలో ఉంచుకునే కదలికలకు అడ్డం రాకుండా.. మరికాస్త ఎక్కువ రక్షణనిచ్చేలా తాజాగా విజన్‌ సిరీస్‌ హెల్మెట్‌ను రూపొందించినట్టు వార్తలొస్తున్నాయి. ఈ కొత్త మోడల్‌ హెల్మెట్‌ పెట్టుకుని ఉంటే హ్యూస్‌ ప్రమాదాన్ని తప్పించుకుని ఉండేవాడా? లేదా? అన్నది ఇప్పుడు ఎవరూ చెప్పలేరు. కానీ బంతి నుంచి మరికాస్త ఎక్కువ రక్షణ అవసరమని మాత్రం హ్యూస్‌ దుర్మరణం హెచ్చరిస్తోంది. ఇప్పటి వరకూ క్రికెట్‌ హెల్మెట్ల తయారీలో ముఖానికి దెబ్బలు తగలకుండా చూడటానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ.. గ్రిల్‌ను మరింతగా మెరుగుపరచటం మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. కేవలం ముఖానికి ముందువైపు రక్షణ కల్పిస్తే సరిపోదని హ్యూస్‌ దుర్మరణం నొక్కి చెబుతోంది!
- ఈనాడు ప్రత్యేక విభాగం

పదుగురి కోసం ఆరుగురం!

కాలేజీ స్నేహితులకో వాట్స్‌యాప్‌ గ్రూప్‌ చిన్నప్పటి మిత్రులకో ఫేస్‌బుక్‌ గ్రూప్‌ బంధువులందరినీ కలిపేందుకు గూగుల్‌ ప్లస్‌.. ఇలా నేటి సామాజిక మాధ్యమాలని మస్తుగా వాడుకుంటోంది...

పచ్చబొట్టేసి...జోలీకి నచ్చేసి!

ఏంజెలీనా జోలీకి రెండంటే మహా ఇష్టం. ఒకటి పిల్లలు, రెండు టాటూలు. ముగ్గురు కన్నబిడ్డలతో పాటు మరో ముగ్గురు అనాథలను దత్తత తీసుకుని పెంచుకుంటోంది జోలీ...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net