‘పది’ పరీక్షలపై ఏపీ విద్యాశాఖ కీలక ఆదేశాలు

తాజా వార్తలు

Published : 29/04/2021 14:50 IST

‘పది’ పరీక్షలపై ఏపీ విద్యాశాఖ కీలక ఆదేశాలు

అమరావతి: సెలవుల్లో పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు డిజిటల్ మాధ్యమాల ద్వారా సహకరించాల్సిందిగా ఏపీ పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయులకు సూచనలు జారీ చేసింది. 2021 పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధమవుతోన్న విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా సందేహాలు నివృత్తి చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. ఈ నేపథ్యంలో జూన్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకూ పాఠశాలల్లో తిరిగి రిపోర్టు చేయాల్సిందిగా ఉపాధ్యాయులను ఆదేశించింది. అంతేకాకుండా జూన్‌లో జరిగే పదో తరగతి పరీక్షల నిర్వహణకు సిద్ధం కావాలని సూచించింది. ఈ మేరకు పరీక్షల నిర్వహణ, విద్యార్ధుల సందేహాల నివృత్తి కోసం తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రాంతీయ డైరెక్టర్లను విద్యాశాఖ ఆదేశించింది. మే 1 నుంచి 31వ తేదీ వరకూ పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని