close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆన్‌లైన్‌లో మహాభేటీ

నేడు, రేపు తెదేపా మహానాడు
‘జూమ్‌’ ద్వారా పాల్గొననున్న 14 వేల మంది

ఈనాడు, అమరావతి: తెదేపా నాయకులు, కార్యకర్తలు పెద్ద పండుగలా భావించే ‘మహానాడు’ను బుధ, గురువారాల్లో నిర్వహిస్తున్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా... పార్టీ చరిత్రలో తొలిసారిగా ‘వర్చువల్‌ మహానాడు’ జరగనుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలు, విదేశాల్లోని పార్టీ ఎన్‌ఆర్‌ఐ విభాగానికి చెందిన నాయకులు, కార్యకర్తలు సుమారు 14 వేల మంది జూమ్‌ యాప్‌ ద్వారా భాగస్వాములవుతున్నారు. యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ లైవ్‌ ద్వారా మరో 10 వేల మంది కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఒక రాజకీయ పార్టీ... ఇన్ని వేల మంది నాయకుల్ని, కార్యకర్తల్ని భాగస్వాముల్ని చేస్తూ ఆన్‌లైన్‌లో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం దేశంలో ఇదే మొదటిసారి.


ఆన్‌లైన్‌లో మహాభేటీ

మే 28న ఎన్టీఆర్‌ జయంతి కలసి వచ్చేలా, ఏటా మూడు రోజులపాటు అత్యంత కోలాహలంగా మహానాడు నిర్వహించడం ఆనవాయితీ. కరోనా వల్ల ఈసారి... పార్టీ నాయకులు, కార్యకర్తలు వారి ఇళ్ల నుంచే మహానాడులో పాల్గొంటున్నారు.పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, పార్టీ ఆంధ్రప్రదేశ్‌ విభాగం అధ్యక్షుడు కళావెంకటరావు సహా, కొందరు పొలిట్‌బ్యూరో సభ్యులు, ముఖ్య నేతలు మాత్రం మంగళగిరి సమీపంలోని పార్టీ జాతీయ కార్యాలయం నుంచి ‘మహానాడు’లో పాల్గొంటారు. మిగిలిన నేతలంతా జూమ్‌ యాప్‌ ద్వారా భాగస్వాములవుతారు.

రెండు రోజుల కార్యక్రమాలు..
* కరోనా నేపథ్యంలో మహానాడును ఈసారి రెండు రోజులకే కుదించారు.
* పార్టీ జాతీయ కార్యాలయంలోని సమావేశమందిరంలో చంద్రబాబు సహా ముఖ్యనేతలు భౌతిక దూరం పాటిస్తూ కూర్చుంటారు. ప్రత్యేకంగా వేదికంటూ ఉండదు.
* బుధవారం ఉదయం 11 గంటలకు కార్యక్రమం మొదలవుతుంది.
* మరణించిన పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఎల్‌జీ పాలిమర్స్‌ దుర్ఘటనలో మృతి చెందినవారికి సంతాపం ప్రకటిస్తారు.
* తెదేపా తెలంగాణ అధ్యక్షుడు ఎల్‌.రమణ, ఏపీ అధ్యక్షుడు కళావెంకటరావు ప్రసంగిస్తారు.
* 12 గంటల నుంచి 12.25 వరకు చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేస్తారు.
* 12.25 నుంచి ఒంటి గంట వరకు తీర్మానాలు ప్రవేశపెడతారు.
* భోజన విరామానంతరం మళ్లీ 4 గంటలకు కార్యక్రమం మొదలవుతుంది.
* గురువారం రెండోరోజు ఎన్టీఆర్‌ జయంతి వేడుకలతో మొదలవుతుంది.
* ఆ తర్వాత మధ్యాహ్నం 12.30 వరకు వివిధ తీర్మానాలు ప్రవేశపెడతారు.
* భోజన విరామం తర్వాత మళ్లీ 4 గంటలకు కార్యక్రమం మొదలవుతుంది.
* రాజకీయ, సంస్థాగత తీర్మానాలతో పాటు, ఇతర తీర్మానాలు ప్రవేశపెడతారు.
* సాయంత్రం 5.05 నుంచి 5.30 వరకు చంద్రబాబు ఉపన్యాసంతో కార్యక్రమం ముగుస్తుంది.

పరిస్థితి చక్కబడ్డాక అధ్యక్షుడి ఎన్నిక..!
తెదేపా అధ్యక్షుడిని రెండేళ్లకు ఒకసారి మహానాడులోనే ఎన్నుకుంటారు. కరోనా వల్ల తలెత్తిన పరిస్థితుల చక్కబడ్డాక... జిల్లా, రాష్ట్ర సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసుకుని, ఆ తర్వాత జాతీయ అధ్యక్షుడి ఎన్నిక నిర్వహిస్తామని పార్టీ వర్గాలు తెలిపాయి.
ప్రవేశపెట్టనున్న అనుబంధ తీర్మానాలు
* విద్యుత్‌ ఛార్జీల పెంపు-మాట తప్పిన జగన్‌.
* ఎల్‌జీ పాలిమర్స్‌ దుర్ఘటన.
* కరోనా వైరస్‌ విజృంభణ- వలస కార్మికుల కష్టాలు.
* తితిదే ఆస్తుల అమ్మకం.

తెలంగాణ తీర్మానాలు
1, వ్యవసాయం. 2. సాగునీటి ప్రాజెక్టులు. 3. విద్య, వైద్య రంగం. 4. తెరాస వాగ్దానాలు, వైఫల్యాలు.
* రెండు ఇతర తీర్మానాలు.


ఏపీ తీర్మానాలు

 

1. అరాచక పాలనకు ఏడాది- ప్రమాదంలో ప్రజాస్వామ్యం.
2. అన్నదాత వెన్ను విరిచిన జగన్‌ సర్కారు.
3. సంక్షోభంలో సాగునీటి ప్రాజెక్టులు, తనవారికి కట్టబెట్టేందుకు పోలవరాన్ని రెండేళ్లు వెనక్కి నెట్టారు- డ్యాం భద్రతకు చేటు తెచ్చారు.
4. అక్రమ కేసులు- ఆస్తుల విధ్వంసం- పోలీసు వ్యవస్థ దుర్వినియోగం.
5. ప్రజా రాజధాని అమరావతి- మూడు ముక్కలాటతో రాష్ట్రాభివృద్ధి అధోగతి.
6. బలిపీఠంపై బడుగుల సంక్షేమం- 34 పథకాల రద్దు.
7. భూ దురాక్రమణలు-జే ట్యాక్స్‌- జైలు జీవితం నుంచి పాఠాలు నేర్వరా? చేసిన నేరాలే తిరిగి చేస్తారా? - భారీ అవినీతి.
8. ధరల పెంపు - 3, 4 రెట్లు అధికం- ప్రజలపై   రూ.50 వేల కోట్ల భారం.
9. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విచ్ఛిన్నం.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.