ఏలూరులో వైకాపా ఘనవిజయం

ప్రధానాంశాలు

ఏలూరులో వైకాపా ఘనవిజయం

47 స్థానాల కైవసం
3 స్థానాలతో సరిపెట్టుకున్న తెదేపా

ఈనాడు డిజిటల్‌, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరపాలక ఎన్నికల్లో వైకాపా ఘన విజయం సాధించింది. ఆదివారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించి ఫలితాలను వెల్లడించారు. కార్పొరేషన్‌ పరిధిలో మొత్తం 50 స్థానాలకు మూడు చోట్ల వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. మిగిలిన 47 స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో 44 చోట్ల ఆ పార్టీ విజయం సాధించింది. ప్రధాన ప్రతిపక్షం తెదేపా 3 స్థానాల్లో గెలిచింది. తెదేపా 43, స్వతంత్రులు 39, జనసేన 20, భాజపా 14, కాంగ్రెస్‌ 4, సీపీఐ 3, సీపీఎం ఒక స్థానంలో పోటీ చేశాయి. మొత్తం 171 మంది బరిలో నిలిచారు.

వైకాపా తరఫున 45, 46వ డివిజన్లలో పోటీ చేసిన ప్రతాప్‌చంద్రముఖర్జీ, ప్యారీబేగం అనారోగ్య కారణాలతో మృతి చెందారు. వీరిద్దరూ ఎన్నికల్లో గెలిచారు. మార్చి 10న నిర్వహించిన ఈ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఫలితాలు నిలిచిపోగా, 4నెలల తర్వాత ఆదివారం లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. ఈ నెల 30న మేయర్‌, డిప్యూటీ మేయర్ల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని