icon icon icon
icon icon icon

‘నువ్వే గెలుస్తున్నావ్‌ అన్నా!’.. ఈటలతో భారాస ఎమ్మెల్యే మల్లారెడ్డి

‘మల్కాజిగిరి లోక్‌సభ స్థానంలో నువ్వే గెలుస్తున్నావ్‌ అన్నా’ అని భాజపా మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థి ఈటల రాజేందర్‌తో భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

Published : 27 Apr 2024 04:23 IST

మేడ్చల్‌ రూరల్‌, న్యూస్‌టుడే: ‘మల్కాజిగిరి లోక్‌సభ స్థానంలో నువ్వే గెలుస్తున్నావ్‌ అన్నా’ అని భాజపా మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థి ఈటల రాజేందర్‌తో భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. శుక్రవారం మేడ్చల్‌ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపల్‌ పరిధిలోని కండ్లకోయలో జరిగిన ఓ వివాహ వేడుకకు ఈటల, మల్లారెడ్డి హాజరయ్యారు. అక్కడ ఎదురుపడిన ఈటలను మల్లారెడ్డి ఆప్యాయంగా పలకరించారు. ‘అన్నా’ అంటూ దగ్గరకు తీసుకుని. ఆలింగనం చేసుకున్నారు. ఈటలతో కలిసి ఉత్సాహంగా ఫొటోలు తీయించుకున్నారు. ‘నేను గెలుస్తున్నానా’ అని మల్లారెడ్డిని ఈటల అడగగా.. ‘నువ్వే గెలుస్తున్నావ్‌ అన్నా. ఇంకేం సందేహం లేదు. నా కుమారుడి సీటు గుంజుకున్నావు కదా’ అంటూ ఈటల బుగ్గలను పట్టుకున్నారు. ఇలా కలవడం అరుదని, మళ్లీ ఎవరు ఎక్కడెలా కలుస్తామో తెలియదని వ్యాఖ్యానించారు. ఇంతలో ఇటీవల భారాస నుంచి భాజపాలోకి చేరిన రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు నందారెడ్డి అక్కడికి రాగా.. ఆయనను చూపిస్తూ ‘నా కుడి భుజాన్ని కోసిచ్చాను’ అంటూ ఈటలతో మల్లారెడ్డి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img