మోటుపల్లిలో ప్రతాపరుద్రుని తమిళ శాసనం

ప్రధానాంశాలు

మోటుపల్లిలో ప్రతాపరుద్రుని తమిళ శాసనం

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు: కాకతీయ ప్రతాపరుద్ర చక్రవర్తి కాలంలో తమిళంలో వేయించిన శాసనాన్ని ప్రకాశం జిల్లా చినగంజాం మండలం మోటుపల్లిలో ప్రముఖ చరిత్రకారుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో ఈమని శివనాగిరెడ్డి ఆదివారం గుర్తించారు. స్థానిక కోదండ రామస్వామి దేవాలయంలో ఈ శాసనం వెలుగుచూసింది. తిరువిడైయాట్టం పేరుతో నిర్వహించిన ఉత్సవాల సందర్భంగా మోటుపల్లిలోని రాజనారాయణ పెరుమాళ్‌ ఆలయానికి స్థానికుడు ఒకరు భూమిని దానం చేసిన వివరాలు అందులో ఉన్నాయని శివనాగిరెడ్డి తెలిపారు. కాకతీయ రాజులు తమిళ శాసనాన్ని వేయించడం భాషాపరంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. శాసనం దొరికిన ప్రాంతం తమిళుల నివాస ప్రాంతంగా ఉండేదని.. వారికోసం తమిళంలో వేయించినట్లు భావిస్తున్నామని ఆయన చెప్పారు. కోదండరామస్వామి ఆలయం చుట్టూ మరో 10 తమిళ శాసనాలు ఉన్నాయని..వాటి నకళ్లు తీసి చారిత్రక విషయాలను వెలుగులోకి తీసుకురావాలని కేంద్ర పురావస్తుశాఖకు  విజ్ఞప్తి చేశారు. ఈ శాసనాన్ని గతంలో గుర్తించామని, అధికారికంగా ఇంతవరకు ప్రకటించలేదని కేంద్ర పురావస్తు శాఖ శాసనవిభాగం సంచాలకుడు డాక్టర్‌ కె మునిరత్నంరెడ్డి చెప్పారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని