నడిచి వెళ్లాలన్నా నరకమే!

ఈనాడు, కర్నూలు: కర్నూలు జిల్లా హాల్వహర్వి మండలం మాచనూరు వద్ద కల్వర్టు వంతెన ఐదేళ్ల క్రితం కురిసిన వర్షాలకు ధ్వంసమైంది. నేటికీ ఆ శిథిలాలు అలానే ఉన్నాయి. అధికారులు, నాయకులెవ్వరికీ అక్కడో కొత్త కల్వర్టు నిర్మించాలనే ఆలోచనే రాలేదు. కనీసం అక్కడున్న శిథిలాలనూ తొలగించలేదు. ప్రజలు అటు నుంచి నడిచి వెళ్లేందుకూ సాధ్యం కావడం లేదు. దీంతో వాగులోంచి రాకపోకలు సాగిస్తున్నారు. మండల కేంద్రానికి ఇదే దగ్గరి దారి. ఇటు నుంచి వెళ్తే హాల్వహర్వికి 3 కి.మీ. వస్తుంది. అదే చుట్టూ తిరిగి వెళ్తే 8 కి.మీ. వస్తోంది. వర్షంపడితే చాలు వాగు పొంగి, రాకపోకలు నిలిచిపోతున్నాయి. 


మరిన్ని

ap-districts
ts-districts