EPF: పీఎఫ్ ఖాతాలో చందాను సంస్థ జ‌మ చేయ‌క‌పోతే..?

ఇంటర్నెట్‌ డెస్క్‌: వివిధ కంపెనీల్లో, సంస్థ‌ల్లో ప‌నిచేసే ఉద్యోగుల‌కు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో ఉద్యోగి కాంట్రిబ్యూష‌న్‌ (వాటా)తో పాటు సంస్థ వాటా కూడా ఉంటుంది. అంతేకాకుండా ఇతర పొదుపు పథకాలకంటే మెరుగైన వ‌డ్డీ రేటు (8.10%)ను ఇది అందిస్తుంది. ప్ర‌తి నెలా ఉద్యోగి ప్రాథ‌మిక జీతంలో 12 శాతాన్ని పీఎఫ్ ఖాతాకు త‌న వంతుగా చెల్లిస్తాడు. సంస్థ కూడా అంతే స‌మాన‌మైన మొత్తాన్ని జ‌మ చేస్తారు. సంస్థ అందించే కాంట్రిబ్యూష‌న్‌లో 8.33% ఉద్యోగుల పెన్ష‌న్ స్కీమ్ (EPS)కి, మిగిలిన మొత్తం పీఎఫ్ ఖాతాకు వెళుతుంది.

య‌జ‌మాని వాటా ఎప్ప‌టిలోగా చేయాలి?
జీతం చెల్లించిన 15 రోజుల్లోపు య‌జ‌మానులు ఈపీఎఫ్ కంట్రిబ్యూష‌న్‌ని చెల్లించాలి. ఉదా: య‌జ‌మాని ఆగ‌స్టు నెల జీతాన్ని సెప్టెంబ‌రు 1న ఉద్యోగికి చెల్లిస్తే.. అదే నెల 15లోపు ఉద్యోగి, య‌జ‌మాని కంట్రిబ్యూష‌న్‌ని పీఎఫ్ ఖాతాలో జ‌మ చేయాలి.

చందా జ‌మ‌యిందో లేదో తెలుసుకోవ‌చ్చా?
సంస్థ.. త‌న ఉద్యోగికి సంబంధించిన షేర్‌ను ప్ర‌తినెలా PF ఖాతాకు జ‌మ చేయ‌డం త‌ప్ప‌నిస‌రి. ఉద్యోగి EPFO పోర్ట‌ల్‌లో త‌న‌ ఖాతాలోకి లాగిన్ అయ్యి య‌జ‌మాని త‌న ఖాతాకు నెల‌వారీ ప్రావిడెంట్ ఫండ్ చందాను పంపిస్తున్నారో లేదో త‌నిఖీ చేయ‌వ‌చ్చు. పీఎఫ్‌ మొత్తం య‌జ‌మాని జ‌మ‌చేసిన‌ ప్రతిసారీ ఉద్యోగికి ఎస్సెమ్మెస్‌ ద్వారా సమాచారం అందుతుంది.

య‌జ‌మాని వాటా చెల్లించకపోతే?
పీఎఫ్ వాటాను ఉద్యోగి పనిచేస్తున్న యాజమాన్యం డిపాజిట్ చేయ‌క‌పోతే EPFOకి ఫిర్యాదు చేయొచ్చని న్యాయ నిపుణులు అంటున్నారు. కొన్ని చోట్ల ఉద్యోగికి సంబంధించిన పీఎఫ్‌ని సంస్థ క‌ట్ చేస్తుంది గానీ EPFOకి జ‌మ‌చేయ‌రు. ఇలాంటి సందర్భాల్లో EPF చ‌ట్టం ప్రకారం.. ఐపీసీ సెక్ష‌న్ 406/409 కింద యజమానిపై పోలీసులకు EPFO ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. య‌జ‌మానులు స‌కాలంలో తమ వాటాను చెల్లించేలా కేంద్ర బ‌డ్జెట్- 2021లో నిబంధనలను కేంద్రం సవరించింది. ఒకవేళ
స‌కాలంలో ఈపీఎఫ్ చందాలు ఇవ్వ‌డంలో విఫ‌ల‌మైతే ఆ సంస్థ.. త‌న ఆదాయ ప‌న్ను మిన‌హాయింపును క్లెయిమ్ చేయ‌లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని