జోయాలుక్కాస్‌కు ప్రతిష్ఠాత్మక అవార్డులు

హైదరాబాద్‌: పసిడి ఆభరణాల విక్రయ సంస్థ జోయాలుక్కాస్‌కు ప్రతిష్ఠాత్మక 17వ రిటైల్‌ జువెలర్‌ ఇండియా అవార్డ్స్‌ 2022లో పలు పురస్కారాలు లభించాయి. బెస్ట్‌ బ్రైడల్‌ డైమండ్‌ జువెలరీ ఆఫ్‌ ది ఇయర్‌, బెస్ట్‌ టీవీ క్యాంపైన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2022 అవార్డులను జోయాలుక్కాస్‌ దక్కించుకుంది. 20 విభాగాల్లో 1000కు పైగా డిజైన్లకు గాను ఈ అవార్డులు పొందింది. 400కు పైగా ప్రత్యేకమైన డిజైన్‌లను పరిశీలించిన జ్యూరీ ఈ అవార్డులు ప్రకటించింది. ‘భారత ఆభరణాల విపణిలో పోటీని తట్టుకుని ఎల్లప్పుడూ అత్యుత్తమ సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నాం. విజేతలందరికీ శుభాకాంక్షలు’ అని జోయాలుక్కాస్‌ ఎండీ అలుక్కాస్‌ వర్గీస్‌ జాయ్‌ తెలిపారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని