వాణిజ్య పన్నుల రాబడిలో 15% పెరుగుదల

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ రాబడిలో 15 శాతం వృద్ధిరేటు నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో జులై వరకు రూ.22,656 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది ఇదే కాలానికి వచ్చిన రూ.19,765 కోట్లతో పోలిస్తే.. ప్రస్తుతం రూ.2,891 కోట్లు అధిక రాబడి నమోదైంది. ఈ శాఖ ద్వారా ఈ ఏడాది రూ.69,203 కోట్ల రాబడిని అంచనా వేశారు. జులై ఆఖరుకు ఇందులో 33 శాతం ఆదాయం సమకూరింది. రాష్ట్ర ఖజానాకు కీలక ఆదాయం వాణిజ్య పన్నులశాఖ ద్వారానే సమకూరుతోంది. ప్రధానంగా జీఎస్టీ, పెట్రోలియం ఉత్పత్తులు, మద్యం అమ్మకం పన్ను ద్వారా ఆదాయం వస్తోంది. 

* జీఎస్టీ రాబడి 41 శాతం పెరిగింది. గత ఏడాది మొదటి 4 నెలల్లో రూ.8,545 కోట్లు రాగా ఈ సారి రూ.12,035 కోట్లు వచ్చింది.

* పెట్రోలియం ఉత్పత్తులపై అమ్మకం పన్ను ఆదాయం 42 శాతం పెరిగింది. ఈ ఆదాయం ప్రతి నెలా పెరుగుతోంది. జులైలో అత్యధికంగా రూ.1400 కోట్ల అమ్మకం పన్ను రాబడి నమోదైంది.

* మద్యం అమ్మకం పన్ను రాబడి 17 శాతం పెరిగింది. ప్రతి నెలా సగటున రూ.1200 కోట్ల వరకు మద్యం అమ్మకం పన్ను ఆదాయం వస్తోంది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని