మాపై దండయాత్రకే చైనా సైనిక విన్యాసాలు

తైవాన్‌ విదేశాంగ మంత్రి జోసెఫ్‌ వూ వెల్లడి

పింగ్‌టంగ్‌ (తైవాన్‌): స్వీయపాలనలోని ద్వీపదేశ ప్రజాస్వామ్యంపై దండయాత్ర చేయడానికే చైనా తన సైనిక విన్యాసాలను సన్నాహాలుగా వినియోగిస్తోందని తైవాన్‌ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జోసెఫ్‌ వూ మంగళవారం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చైనా దాడిని అడ్డుకునేందుకు సిద్ధమయ్యేలా తైవాన్‌ సైన్యం తన సొంత యుద్ధ విన్యాసాలను ఆరంభించిందని తెలిపారు. పశ్చిమ పసిఫిక్‌లో ఆధిపత్యాన్ని నెలకొల్పడం, తన సొంత భూభాగంగా చెప్పుకొంటున్న తైవాన్‌ను కలిపేసుకోవడమే చైనా లక్ష్యమని తెలిపారు. తైవాన్‌ జలసంధి ద్వారా తూర్పు, దక్షిణ చైనా సముద్రాలపై నియంత్రణ, అమెరికా దాని మిత్ర దేశాలు తైవాన్‌కు సహకరించకుండా అడ్డుకోవడం కూడా బీజింగ్‌ లక్ష్యాలని తైపీలో విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. చైనా తన బెదిరింపులకు అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌ను సందర్శించడాన్ని సాకుగా పేర్కొంటోందని ఆరోపించారు.


మరిన్ని

ap-districts
ts-districts