close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
లినెన్‌ మనసు దోచెన్‌

పసిడి అంచులు, రంగుల బుటీలు, పక్షులు, పూలు, లతలు.. వెరసి ఆకర్షణీయమైన వర్ణాలు.. అద్భుతమైన డిజైన్లతో... లినెన్‌ చీరల వస్త్రశ్రేణి... మగువల మనసును దోచేస్తోంది. వాటిని మీరూ చూసేయండి మరి.

గులాబీ రంగు లినెన్‌ చీరకు జతగా లేత నీలిరంగు జరీ టెంపుల్‌ బార్డర్‌... చీరంతా పరుచుకున్న బుటీలు.. ఆ‘కట్టు’కునేలా ఉన్నాయి కదూ!

పీచ్‌-రెడ్‌ లినెన్‌ టిష్యూ చీరకు జతగా బంగారు జరీ అంచు.. మెరిసే పూల మోటిఫ్‌లను మెచ్చని మగువ ఉంటుందా!

లేత గోధుమరంగు లినెన్‌ చీరపై అక్కడక్కడా నల్లటి కుసుమాలు...పసిడి అంచుపై గళ్లు... అందులో నలుపు, వెండి రంగు బుటీలు... ఆకర్షణీయం.

ఎంబ్రాయిడరీతో చేసిన పక్షులు, తీగల డిజైన్‌తో లేత నారింజ రంగు చీర సొగసు, జరీ అంచూ.. మీకూ కావాలా...

ఫొటోలు: పాతూరి పద్మావతి

మోడల్‌: శ్రియ


మరిన్ని