close

తాజా వార్తలు

వ్యవసాయం రూపురేఖలు మారాలి: కేసీఆర్

హైదరాబాద్‌: మారుతున్న అలవాట్లకు అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులు రావాలని.. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ముడిసరకు నిరంతరం అందేలా పంటలు వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. ప్రగతిభవన్‌లో వ్యవసాయ మార్కెటింగ్‌ నిపుణులతో సీఎం కేసీఆర్‌ సమీక్షించారు. రాష్ట్రంలో పంటల సాగు, అగ్రి బిజినెస్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఆగ్రో పరిశ్రమ అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై అధికారులు, నిపుణులతో ప్రధానంగా చర్చించారు. వ్యవసాయంలో మార్పులకు స్వల్ప, దీర్ఘకాలిక వ్యూహాలు అమలు చేయాలని అధికారులకు కేసీఆర్‌ సూచించారు. భవిష్యత్‌ తెలంగాణలో వ్యవసాయం రూపురేఖలు మారాలని ఆకాంక్షించారు. రైతుల పంటలకు విలువ జోడించేలా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెజ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. నాణ్యమైన ఉత్పత్తులతో తెలంగాణకు బ్రాండ్‌ ఇమేజ్‌, అంతర్జాతీయ డిమాండ్‌ రావాలన్నారు. ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకంలో అనేక మార్పులు రావాలని.. వ్యాపారుల మాటలు నమ్మి రైతులు వాటిని అధికంగా వాడకూడదని సీఎం కేసీఆర్‌ సూచించారు.
 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు