close

గ్రేటర్‌ హైదరాబాద్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రక్షణ ఉత్పత్తుల తయారీకి పారిశ్రామికవేత్తలు ముందుకురావాలి

డీఆర్‌డీవో ఛైర్మన్‌ సతీష్‌రెడ్డి పిలుపు

మహేశ్వరం, న్యూస్‌టుడే: మేకిన్‌ ఇండియాలో భాగంగా సాయుధ బలగాలకు ఆధునిక రక్షణ పరికరాలను అందించేందుకు వెమ్‌ టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ముందుకు రావడం అభినందనీయమని డీఆర్‌డీవో ఛైర్మన్‌ డా.జి.సతీష్‌రెడ్డి అన్నారు. ఈ సంస్థ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని హార్డ్‌వేర్‌పార్కులో రూ.వంద కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ డివిజన్‌- ఆర్‌ఎఫ్‌ సీకర్ల తయారీ విభాగాన్ని శనివారం సంస్థ వ్యవస్థాపక ఛైర్మన్‌, ఎండీ వెంకటరాజు, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌లతో కలిసి ఆయన ప్రారంభించారు. రక్షణ పరికరాలు, వివిధ రకాల క్షిపణుల కోసం ఐఐఆర్‌ సీకర్లను అందించడానికి వెమ్‌ టెక్నాలజీ హైదరాబాద్‌లో ఏర్పాటు కావడం మంచి పరిణామమని సతీష్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నందున ప్రైవేటు రంగంలో రక్షణ ఉత్పత్తుల తయారీకి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు