
క్రీడలు
హైదరాబాద్ మరో విజయం
సూరత్: కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (122; 116 బంతుల్లో 15×4, 1×6) సెంచరీతో మెరవడంతో విజయ్‌హజారె ట్రోఫీలో హైదరాబాద్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. మంగళవారం ఎలైట్ గ్రూప్-ఏ పోరులో హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో చత్తీస్‌గఢ్‌ను ఓడించింది. మొదట చత్తీస్‌గఢ్ 7 వికెట్లకు 242 పరుగులు చేసింది. మెహదీ హసన్ (3/32), రవితేజ (2/60) ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఛేదనలో తన్మయ్‌తో పాటు తిలక్‌వర్మ (60), హిమాలయ్ (49) రాణించడంతో హైదరాబాద్ 40.4 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. మరో మ్యాచ్‌లో ఆంధ్ర 7 వికెట్ల తేడాతో తమిళనాడును ఓడించింది.