close

తెలంగాణ

వాగు ఉప్పొంగి.. బాధను దిగమింగి

ఎవరన్నా జబ్బుపడితే ఆసుపత్రికి తీసుకెళ్లలేరు. ఆసుపత్రిలో మరణిస్తే ఇంటికి తీసుకుపోలేరు. ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం గుబిడి గ్రామస్థుల దయనీయ గాథ ఇది. వర్షాకాలం వారి బాధలు చెప్పనలవి కాదు. ఆ గ్రామానికి చెందిన పదేళ్ల బాలిక  మౌనిక గుండె సంబంధిత వ్యాధితో రిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం  మృతిచెందింది. మృతదేహాన్ని తీసుకొని అంబులెన్సులో గ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యంలో కరంజి-టి సమీపంలోని వాగు ఉప్పొంగడంతో గుబిడికి వెళ్లలేని పరిస్థితి. విషయం తెలిసిన గ్రామస్థులు ఎదురుగా వచ్చి స్ట్రెచర్‌పై బాలిక మృతదేహాన్ని ఉంచి వాగు దాటించారు. బోథ్‌ ఎమ్మెల్యే రాఠోడ్‌ బాపురావు అసెంబ్లీలో గుబిడివాసుల ఇబ్బందులను ప్రస్తావించిన రెండు రోజులకే ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

- న్యూస్‌టుడే, భీంపూర్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు