close

జాతీయ- అంతర్జాతీయ

తాత్కాలిక నిర్మాణంలో రామ్‌లల్లా విగ్రహం

అయోధ్య/లఖ్‌నవూ: అయోధ్యలోని రామ్‌లల్లా విగ్రహాన్ని కొత్తగా ఏర్పాటుచేసిన తాత్కాలిక నిర్మాణంలో ఉంచారు. రాజస్థాన్‌కు చెందిన కళాకారులు రూపొందించిన 9.5 కిలోల వెండి సింహాసనంపై విగ్రహం కొలువుదీరింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ నిర్మాణం పూర్తయ్యే వరకూ తాత్కాలిక నిర్మాణంలోనే విగ్రహం ఉంటుంది. రామ్‌లల్లా విగ్రహం తరలించడంతో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించడానికి స్థలం సిద్ధమైనట్లే. ఇందుకు సంబంధించి సోమవారం ప్రారంభమైన పూజలు బుధవారం ఉదయం పూర్తయ్యాయి.   ఈ సందర్భంగా ఆలయ నిర్మాణం కోసం ఆదిత్యనాథ్‌ వ్యక్తిగతంగా రూ.11 లక్షల విరాళం అందజేశారు. మరోవైపు, రామ్‌లల్లా విగ్రహాల తరలింపు కార్యక్రమంలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పాల్గొనడం, సామాజిక దూరం పాటించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు