close

తెలంగాణ

విద్యుత్తు ఛార్జీలపై బాబు అసత్య ప్రచారం

మంత్రి బాలినేని ధ్వజం

ఈనాడు, అమరావతి: విద్యుత్తు ఛార్జీల విషయంలో తెదేపా అధినేత చంద్రబాబు రోజుకో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రాష్ట్ర విద్యుత్తు, అటవీ శాఖల మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో గురువారం మాట్లాడుతూ.. ‘విద్యుత్తు ఛార్జీల విషయంలో మంత్రులు వాస్తవాలను వివరిస్తుంటే వారికి అవగాహన లేదంటూ కించపరిచేలా చంద్రబాబు మాట్లాడుతున్నారు. బాబు పాలనలో ఏడాది మొత్తం స్థిర కేటగిరి అమలుతో కొన్ని నెలల్లో తక్కువ వాడుకున్నా అధిక టారిఫ్‌ ప్రకారం ప్రజలు బిల్లు చెల్లించారు. విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ప్రజాభిప్రాయాన్ని సేకరించాకే టారిఫ్‌ విధానంలో ప్రభుత్వం మార్పు తెచ్చింది. చంద్రబాబు పేర్కొన్నట్లు ఛార్జీలు పెంచలేదు. విద్యుత్తు సంస్కరణల గురించి చంద్రబాబు మాట్లాడటం సమంజసం కాదు. ప్రస్తుతం తక్కువ ధరకు బహిరంగ మార్కెట్‌లో కొనుగోలుతో రూ.700 కోట్లు, బొగ్గు కొనుగోలు టెండర్లలో రూ.190 కోట్లు ఆదా చేశాం’ అని వివరించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు