బ్రేకింగ్

breaking
26 Apr 2024 | 11:56 IST

కొడాలి నాని నామినేషన్‌పై వివాదం

గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ వైకాపా అభ్యర్థి కొడాలి నాని నామినేషన్‌పై వివాదం నెలకొంది. నామినేషన్‌ పత్రాల్లో తప్పుడు సమాచారం ఇచ్చారని రిటర్నింగ్‌ అధికారికి తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు. మున్సిపల్‌ కార్యాలయాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. భవనాన్ని అద్దెకిచ్చినట్లు అధికారులు ఇచ్చిన పత్రాలను దీనికి జతచేశారు. తప్పుడు సమాచారమిచ్చిన నాని అభ్యర్థిత్వాన్ని తిరస్కరించాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు ఏ ప్రభుత్వ కార్యాలయాన్నీ వినియోగించలేదని కొడాలి నాని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. దీంతో రిటర్నింగ్‌ అధికారి నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని