icon icon icon
icon icon icon

కొడాలి నాని నామినేషన్‌పై వివాదం.. ఆర్వో నిర్ణయంపై ఉత్కంఠ

కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ వైకాపా అభ్యర్థి, మాజీ మంత్రి కొడాలి నాని నామినేషన్‌పై వివాదం ఏర్పడింది. నామినేషన్‌ పత్రాల్లో తప్పుడు సమాచారం చేర్చారంటూ రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో)కు తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు.

Updated : 26 Apr 2024 12:17 IST

గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ వైకాపా అభ్యర్థి, మాజీ మంత్రి కొడాలి నాని నామినేషన్‌పై వివాదం ఏర్పడింది. నామినేషన్‌ పత్రాల్లో తప్పుడు సమాచారం చేర్చారంటూ రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో)కు తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు. మున్సిపల్‌ కార్యాలయాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. భవనాన్ని అద్దెకిచ్చినట్లు అధికారులు పేర్కొన్న పత్రాలను దీనికి జత చేశారు. తప్పుడు సమాచారమిచ్చిన నాని నామినేషన్‌ను తిరస్కరించాలని కోరారు. ఏ ప్రభుత్వ కార్యాలయాన్నీ వినియోగించలేదని కొడాలి నాని తన అఫిడవిట్‌లో పేర్కొన్న నేపథ్యంలో ఆధారాలతో తెదేపా ఫిర్యాదు చేసింది. రిటర్నింగ్‌ అధికారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img