భారత్‌లో 100 కేన్సర్‌ పరీక్షా కేంద్రాల ఏర్పాటుకు ఫ్యూజిఫిల్మ్‌ రూ.1450 కోట్ల పెట్టుబడులు - Fujifilm invests Rs 1450 crore to set up 100 cancer testing centers in India
close

Updated : 05/02/2021 05:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌లో 100 కేన్సర్‌ పరీక్షా కేంద్రాల ఏర్పాటుకు ఫ్యూజిఫిల్మ్‌ రూ.1450 కోట్ల పెట్టుబడులు

దిల్లీ: పది సాధారణ కేన్సర్‌లను పరీక్షించేందుకు భారత్‌లో 100 ఆరోగ్య స్క్రీనింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి 200 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.1450 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు ఫ్యూజిఫిల్మ్‌ ప్రకటించింది. ఇటువంటి కేంద్రాల్లో మొదటిది అయిన ‘న్యూరా సెంటర్స్‌’ను గురువారం ఫ్యూజిఫిల్మ్‌, డాక్టర్‌ కుట్టీస్‌ హెల్త్‌కేర్‌ సంయుక్తంగా బెంగళూరులో ప్రారంభించాయి. ఈ కేంద్రాల్లో కృత్రిమ మేధ అనుసంధానిత ఇమేజింగ్‌, నిపుణుల పర్యవేక్షణ ఉంటుంది. ఈ కేంద్రాల్లో  నోటి కేన్సర్‌, రొమ్ము కేన్సర్‌, గర్భాశయ కేన్సర్‌, ఊపిరితిత్తుల కేన్సర్‌, పొట్ట కేన్సర్‌, పేగు కేన్సర్‌, ప్రొస్టేట్‌ కేన్సర్‌, అన్నవాహిక కేన్సర్‌, స్వరపేటిక కేన్సర్‌, లుకేమియా సహా జీవనశైలి జబ్బుల నిర్థారణ పరీక్షలు చేస్తారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని