ఆ బైకులను రీకాల్‌ చేయనున్న హోండా - HMSI to recall this model bikes
close

Published : 12/03/2021 20:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ బైకులను రీకాల్‌ చేయనున్న హోండా

దిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) ఇటీవల విడుదల చేసిన 350 సీసీ సామర్థ్యం కలిగిన హెచ్‌నెస్‌ సీబీ 350 మోడల్‌ బైకులను వెనక్కి రప్పించనుంది. ట్రాన్స్‌మిషన్‌ పార్ట్‌ను సరిచేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోండా తెలిపింది. గతేడాది నవంబరు 25 నుంచి డిసెంబర్‌ 12 మధ్య ఉత్పత్తి చేసిన బైకులను రీకాల్‌ చేయనున్నట్లు పేర్కొంది. ఆయా బైకుల్లో ట్రాన్స్‌మిషన్‌కు సంబంధించి నాలుగో గేర్‌ కౌంటర్‌ షాఫ్ట్‌లో వినియోగించిన విభిన్నంగా ఉందని గుర్తించామని ఓ ప్రకటనలో తెలిపింది. భవిష్యత్‌లో వాహనదారులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

ఇప్పటి వరకు లోపానికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదులూ రాలేదని హోండా తెలిపింది. మార్చి 23 నుంచి రీకాల్‌ కార్యక్రమం ప్రారంభం కానుందని పేర్కొంది. ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇందుకోసం ఎలాంటి రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. ఈ విషయాన్ని కాల్‌/ ఈ-మెయిల్‌/ఎస్సెమ్మెస్‌ ద్వారా వినియోగదారులకు తెలియజేస్తామంది. అయితే, ఎన్ని వాహనాలను వెనక్కి రప్పించేదీ హోండా వెల్లడించలేదు. గతేడాది అక్టోబర్‌ విడుదల చేసిన ఈ మోడల్‌ ప్రారంభ ధర ₹1.85 లక్షలు.

ఇవీ చదవండి..

టీవీఎస్‌ కొత్త అపాచీ.. ధర ఎంతంటే?

రూ. 10 లక్షల బడ్జెట్‌లో ఎక్కువ మైలేజీ ఇచ్చే కార్లు


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని