తొలి ట్వీట్‌కు రూ.18.30 కోట్లు! - High Bid for Twitter first tweet
close

Updated : 07/03/2021 14:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తొలి ట్వీట్‌కు రూ.18.30 కోట్లు!

శాన్‌ఫ్రాన్సిస్కో: నిత్యం ఉరుకులు పరుగులతో తీరిక లేని జీవితం గడుపుతున్న మనుషులకు కబుర్లు చెప్పేందుకు వచ్చిన చిరు పిట్ట ట్విటర్‌. మరి ఆ కబుర్ల టెక్‌ పక్షి తెచ్చిన తొలి ట్వీట్‌ ఏంటో తెలుసా? ‘‘జస్ట్‌ సెట్టింగ్‌ అప్‌ మై ట్విటర్‌’’ అంటూ తొలిసారి మనందరినీ పలకరించింది. ట్విటర్‌ సహ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సీ మార్చి 21, 2006లో ఆ ట్వీట్‌ చేశారు.

ఇప్పుడు అందరి జీవితాల్లో భాగమైన ట్విటర్‌లో తొలి ట్వీట్‌ అంటే ప్రత్యేకమేగా మరి. అందుకే దీన్ని జాక్‌ డోర్సీ ‘వాల్యుయబుల్స్‌ బై సెంట్‌’ వెబ్‌సైట్‌లో అమ్మకానికి పెట్టారు. ఈ విషయాన్ని శుక్రవారం ఆయన ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ఇప్పటి వరకు లక్షల మంది ట్వీట్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేస్తూ బిడ్లు దాఖలు చేశారు. అత్యధికంగా 2.5 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.18.30 కోట్లు) ఇచ్చేందుకు ఓ ఔత్సాహికుడు ముందుకు వచ్చారు.

ఈ ట్వీట్‌ను కొనుగోలు చేసిన వారికి ట్విటర్‌ సీఈవో డిజిటల్‌గా వెరిఫై చేసి, సంతకం చేసిన ఓ ధ్రువపత్రాన్ని అందజేస్తారు. ఆ పత్రంలో ట్వీట్‌తో పాటు అది పోస్ట్‌ సమయం వంటి వివరాలు ఉంటాయి.

ఇవీ చదవండి...

రూ.1,500 కోట్లతో బీపీసీఎల్‌ పైప్‌లైన్‌

వారంలో భారీగా కరిగిన మస్క్‌ సంపద!


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని