పొదుపు ఖాతాపై వ‌డ్డీ రేట్లు పెంచిన ఐడీఎఫ్‌సీ ఫ‌స్ట్ బ్యాంక్‌ - IDFC-First-Bank-hikes-interest-rate-on-savings-account
close

Updated : 07/01/2021 15:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పొదుపు ఖాతాపై వ‌డ్డీ రేట్లు పెంచిన ఐడీఎఫ్‌సీ ఫ‌స్ట్ బ్యాంక్‌

జ‌న‌వ‌రి 1 నుంచి ఐడీఎఫ్‌సీ ఫ‌స్ట బ్యాంక్ పొదుపు ఖాతాల‌పై వ‌డ్డీ రేట్ల‌ను పెంచింది. ల‌క్ష రూపాయ‌ల లోపు ఉన్న పొదుపు ఖాతాల‌పై వ‌డ్డీ రేటును 7 శాతంగా ప్ర‌క‌టించింది. ఇంత‌కుముందు ఇది 6 శాతంగా ఉండేది. ఇత‌ర ప్రైవేటు బ్యాంకుల రేట్ల‌తో పోలిస్తే ఇది 3-4 శాతం అధికం. అదేవిధంగా ల‌క్ష రూపాయ‌ల కంటే ఎక్కువ ఉంటే గ‌తంలో మాదిరిగానే 7 శాతం వ‌డ్డీనే వ‌ర్తిస్తుంద‌ని తెల‌పింది.  బ్యాంకు ఖాతాదారుని డిపాజిట్లు, పొదుపు ఖాతా బ్యాలెన్స్  రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ప్ర‌భుత్వ డిపాజిట్ గ్యారెంటీ బీమా ప‌థ‌కం హామీ  ఉంటుంది. ఇక పొదుపు ఖాతాల‌పై వ‌డ్డీ రేట్లు ఎప్పుడూ స్థిరంగా ఉండ‌వు, బ్యాంకు ఎప్పుడైనా స‌వ‌రిస్తుంది. 

వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షించ‌డానికి బ్యాంకులు ఎక్కువ వ‌డ్డీ రేట్ల‌ను ప్ర‌క‌టిస్తున్నాయి. అయితే పొదుపు ఖాతాల‌పై వ‌డ్డీ మొత్తం ఏడాదికి రూ.10,000 లోపు ఉంటే ఆదాయ ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80టీటీఏ ప్ర‌కారం ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది.  ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఒక‌ వాణిజ్య బ్యాంక్, మార్కెట్ విలువ రూ.22,500 కోట్లు . ఇది 260 శాఖ‌ల‌కు విస్త‌రించింది. 2015 లో బ్యాంకు లైసెన్స్ పొంద‌డంతో పాటు అదే ఏడాది స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల జాబితాలో కూడా చేరింది. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని