close

Updated : 02/03/2021 12:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బీమా సంస్థ‌ల‌కు ఐఆర్‌డీఏఐ కొత్త నిబంధ‌న‌లు 

పాలసీదారులతో సంబంధాల కొనసాగింపు, ప్రామాణిక పద్ధతిలో సమాచారాన్ని అందించడానికి పాలసీదారులకు నిర్థిష్ట వ్య‌వ‌ధిలో నోటీసులు పంపించాల‌ని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) నిబంధనలు జారీ చేసింది.

పాలసీదారులకు బీమా సంస్థలు, ఆరోగ్య బీమా కవరేజీకి సంబంధించిన ముఖ్య‌మైన స‌మాచారం ఎప్పటికప్పుడు తెలియజేయాలి.  మార్చి 1 న ఐఆర్‌డీఏఐ జారీ చేసిన సర్క్యులర్‌లో, ఎంత త్వ‌ర‌గా వీలైతే అంత త్వ‌ర‌గా ఈ చ‌ర్య‌లు ప్రారంభించాలి, మొత్తానికి 2021 జూన్ 1 లోపు జారీ చేసిన సూచనలను పాటించాల్సి ఉంటుంది. ఐఆర్‌డీఏఐ నిబంధనలు అన్ని ఆరోగ్య బీమా పాల‌సీల‌కు  వర్తిస్తాయి.
పాలసీ సర్వీసింగ్‌లో భాగంగా, బీమా సంస్థలు ఆరోగ్య బీమా పాలసీ గురించి ప్రాథమిక సమాచారాన్ని పాలసీదారులకు తెలియజేయాలి. వీటిలో పాలసీ సంఖ్య, అందుబాటులో ఉన్న మొత్తం బీమా,  కవరేజ్ పరిధి, పాలసీ పరిధిలో ఉన్న బీమా వ్యక్తుల సంఖ్య, పాలసీ వ్యవధి, సెటిల్ చేసిన క్లెయిమ్‌ల‌ మొత్తం (ఆ వ్యవధిలో), మిగ‌తా బీమా హామీ,  బోనస్ ఏదైనా ఉంటే మొత్తం అన్ని వివ‌రాలు ఉండాలి.
సమాచారం పునరుద్ధరణ, ప్రీమియం చెల్లింపు వ్య‌వ‌ధి, పునరుద్ధరణకు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తం (పునరుద్ధరణ సమయంలో పేర్కొనబడాలి), గ్రేస్ పీరియడ్ (పునరుద్ధరణ గడువు తేదీ తర్వాత 5 రోజులలోపు), సంప్రదింపు వివరాలు (ఏదైనా స‌మాచారం కోసం) బీమా సంస్థ, పాల‌సీదారు సంబంధిత‌ సేవ, టోల్ ఫ్రీ నంబర్ లేదా ఇ-మెయిల్ ఐడి వంటివి చేర్చాలి.
 పాలసీదారులకు సంవత్సరానికి రెండుసార్లు సమాచారం ఇవ్వాలి, అంటే పాలసీ జారీ చేసిన ఆరు నెలల తరువాత, పునరుద్ధరణ గడువు తేదీకి కనీసం ఒక నెల ముందు ఈ వివ‌రాలు తెలియ‌జేయాలి. అయితే మల్టీఇయర్ పాలసీ విషయంలో, పాలసీ జారీ చేసిన తేదీ నుంచి ఆరు నెలల వ్య‌వ‌ధిలో సమాచారాన్ని పంచుకోవచ్చని సర్క్యులర్ తెలిపింది.

ఆరోగ్య బీమా పాలసీ కింద‌ ఏదైనా క్లెయిమ్ పరిష్కారం అయిన సందర్భంలో, బీమా  మొత్తానికి సంబంధించిన వివరాలతో పాటు అందుబాటులో ఉన్న సంచిత బోనస్‌తో  ఏదైనా ఉంటే పాలసీదారునికి తెలియజేయాలి. దావా పరిష్కరించిన‌ 15 రోజుల్లోపు ఇది పాలసీదారులకు తెలియజేయాలి.

ఐఆర్‌డీఏఐ సర్క్యులర్ ప్రకారం, బీమా సంస్థ సమాచారాన్ని తెలియజేయడానికి ఏదైనా కమ్యూనికేషన్ ప‌ద్ధ‌తిని (సందేశం, ఇ-మెయిల్, లేఖ మొదలైనవి) ఎంచుకోవచ్చు.

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని