Stock Market: లాభాలతో మొదలైన సూచీలు  - Indices open higher
close

Updated : 10/06/2021 09:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock Market: లాభాలతో మొదలైన సూచీలు 

ముంబయి: దేశీయ మార్కెట్లు గురువారం లాభాలతో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయంగా లోహ, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్లు సూచీలకు అండగా నిలుస్తున్నాయి. దీంతో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సెన్సెక్స్‌ 100 పాయింట్లకు పైగా లాభాల్లో ఉండగా.. నిఫ్టీ 15,700 మార్క్‌కు చేరువైంది. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 144 పాయింట్లు లాభపడి 52,085 వద్ద, నిఫ్టీ 54 పాయింట్ల లాభంతో 15,689 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, శ్రీ సిమెంట్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, టెక్‌ మహీంద్రా షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఐటీసీ, అదానీ పోర్ట్స్‌, బజాజ్‌ ఆటో, హీరో మోటార్స్‌, ఐషర్‌ మోటార్స్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని