మా ఉద్యోగాలు ఉండవేమో.. - May our jobs remain due to automation
close

Published : 18/03/2021 12:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మా ఉద్యోగాలు ఉండవేమో..

ప్రతి అయిదుగురిలో ఇద్దరి ఆందోళన ఇదే

దిల్లీ: కరోనా మహమ్మారి నేపథ్యంలో, పెరుగుతున్న యాంత్రీకరణ (ఆటోమేషన్‌) వల్ల వచ్చే 5 ఏళ్లలో తమ ఉద్యోగాలు గల్లంతయ్యే అవకాశం ఉందని 40 శాతం మంది ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. జనవరి 26-ఫిబ్రవరి 8 మధ్య పీడబ్ల్యూసీ భారత్, చైనా సహా 19 దేశాల నుంచి  32,500 మందితో నిర్వహించిన సర్వే ఈ మేరకు వివరించింది. మారుమూల ప్రాంతాల నుంచి (రిమోట్‌ వర్కింగ్‌) పని చేసేందుకు మారడం కూడా ప్రమాదకర పరిణామంగానే ఉద్యోగులు భావిస్తున్నారు. 

ఆటోమేషన్‌తో చాలా ఉద్యోగాలకు ప్రమాదం పొంచిఉందని 60 శాతం మంది పేర్కొన్నారు. సంప్రదాయ ఉపాధి అవకాశాలు భవిష్యత్తులో ఉండకపోవచ్చని 48 శాతం మంది పేర్కొన్నారు. వచ్చే 5 ఏళ్లలో తమ ఉద్యోగాల ఉనికి ప్రశ్నార్థకం కావొచ్చని 39 శాతం మంది అభిప్రాయపడ్డారు.
లాక్‌డౌన్‌తో తమ డిజిటల్‌ నైపుణ్యాలు మెరుగయ్యాయని 40% మంది వెల్లడించారు. కొత్త నైపుణ్యాలు నేర్చుకునేందుకు 77% మంది సిద్ధంగా ఉన్నారు. 
పని ప్రదేశాల్లో కొత్త సాంకేతికతల్ని స్వీకరించడానికి 80 శాతం మంది సిద్ధంగా ఉన్నారు. భారత్‌లో 69 శాతం మంది, దక్షిణాఫ్రికాలో 66 శాతం మంది ఈ విషయంలో చాలా విశ్వాసంతో ఉన్నారు.
సొంతంగా వ్యాపారం స్థాపించాలనే ఆసక్తితో వ్యవస్థాపక నైపుణ్యాలను పెంపొందించుకోవడంపై 49% మంది దృష్టి సారిస్తున్నారు.
* పని ప్రదేశంలో ఎదుర్కొంటున్న వివక్ష వల్ల కెరీర్‌ పురోగతి, శిక్షణ కోల్పోతున్నామని 50 శాతం మంది పేర్కొన్నారు. జాతి వివక్ష కారణమని 13 శాతం మంది, లింగ వివక్ష ఉందని 14 శాతం మంది వెల్లడించారు.
సమాజానికి సహకరించే సంస్థల్లో పని చేయాలని 75% మంది ఉద్యోగులు కోరుకుంటున్నారు.  

ఇవీ చదవండి..
అమెరికా చమురే ఎందుకు..

భారీగా పెరిగిన సూచీలు


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని