హాస్పి కేర్ హెల్త్ పాల‌సీని ప్రారంభించిన రిల‌య‌న్స్  - Reliance-general-insurance-launches-Hospi-Care-policy
close

Updated : 22/01/2021 15:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హాస్పి కేర్ హెల్త్ పాల‌సీని ప్రారంభించిన రిల‌య‌న్స్ 

రిల‌య‌న్స్ జ‌న‌ర‌ల్ ఇన్సురెన్స్ హాస్పి కేర్, ఆరోగ్య బీమా పాల‌సీని నేడు ప్రారంభించింది. ఈ పాల‌సీ ఆరోగ్య అవ‌స‌రాల‌కు ఒకేసారి హామీ మొత్తాన్ని అందిస్తుంది. రూ.1 ల‌క్ష నుంచి రూ.10 ల‌క్ష‌ల హామీతో కూడిన పాల‌సీ అందుబాటులో ఉంటుంది. ప్రారంభ‌ వార్షిక ప్రీమియం రూ. 1669, దీంతో పాటు ప‌న్నులు అద‌నంగా ఉంటాయి. 

జాబితాలో పేర్కొన్న 150+ స‌ర్జ‌రీల‌కు, ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు చేసే 140+ డేకేర్ విధానాల‌కు సంబంధించి ఆసుప‌త్రి ఖ‌ర్చులు ఈ పాల‌సీలో క‌వ‌ర్ అవుతాయి. ఆరోగ్య సంర‌క్ష‌ణ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు న‌గ‌దు అందించేందుకు ఈ పాల‌సీని ప్ర‌త్యేకంగా రూపొందించిన‌ట్లు రిల‌య‌న్స్ జ‌న‌ర‌ల్ ఇన్సురెన్స్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. 

స‌ర్జ‌రీలు, చికిత్స కోసం ఆసుప‌త్రిలో చేరిన‌ప్పుడు, రోజు వారి వైద్యం, ఇత‌ర శ‌స్త్ర చికిత్స‌లు, డెంగ్యూ, మ‌లేరియా, చికున్‌గునియా కార‌ణంగా ఆసుప్ర‌తిలో చేరిన‌ప్పుడు హామీ న‌గ‌దును అందిస్తుంది. పెరుగుతున్న వైద్య ఖ‌ర్చుల‌కు త‌గిన‌ట్లుగా ఈ పాల‌సీని ఎంచుకోవ‌చ్చు. 

ఏవిధంగా ప‌ని చేస్తుంది?

పాల‌సీ కొనుగోలు చేసిన వారు, శ‌స్త్ర చికిత్స విధానం ఆధారంగా 100 శాతం హామీ క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కి,  రూ. 10ల‌క్ష‌ల క‌వ‌రేజ్‌తో పాల‌సీని కొనుగోలు చేసిన వారికి గుండె, ఊపిరితిత్తుల మార్పిడి వంటి శస్త్ర‌చికిత్స‌ల‌కు 100శాతం హామీని చెల్లిస్తారు. ఈ పాల‌సీకి ఉన్న మ‌రో ప్ర‌త్యేక‌త ఏంటంటే జాబితాకి మించిన‌ శ‌స్త్ర‌చికిత్స‌ల‌కు కూడా రూ.20వేల హామీ మొత్తాన్ని చెల్లిస్తారు.  డెంగ్యు, మ‌లేరియా, చికున్‌గునియా వంటి అనారోగ్యాల‌తో మూడు రోజుల‌కు పైగా ఆసుపత్రిలో ఉండాల్సి వ‌స్తే రూ.20 వేల మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తారు. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని