close

Published : 22/04/2021 15:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

stock market: నష్టాల నుంచి లాభాల్లోకి..

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం నాటి ట్రేడింగ్‌ను లాభాలతో ముగించాయి. దేశంలో కరోనా కేసులు ఉద్ధృతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు.. మెటల్‌, ఫైనాన్షియల్‌ షేర్ల అండతో లాభాల్లోకి వచ్చాయి. దీంతో నిఫ్టీ 14,400 పాయింట్ల ఎగువన ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 74.95గా ఉంది. 

ఉదయం 47,361 పాయింట్ల వద్ద భారీ నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌ క్రమంగా కోలుకుని లాభాల్లోకి వచ్చింది. చివరికి 374.87 పాయింట్ల లాభంతో 48,080.67 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 109.80 పాయింట్ల మేర లాభపడి 14,406.20 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో ఐసీఐసీఐ బ్యాంక్‌, విప్రో‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభపడ్డాయి. టైటాన్‌ కంపెనీ, శ్రీ సిమెంట్స్‌, టాటా కన్జూమర్స్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌, హిందుస్థాన్‌ యూనిలీవర్‌, నెస్లే ఇండియా షేర్లు నష్టాలు చవిచూశాయి. నిఫ్టీ మెటల్‌ సూచీ ఒక శాతం, నిఫ్టీ బ్యాంక్‌ సూచీ 2 శాతం చొప్పున లాభపడ్డాయి.

ఇవీ చదవండి

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని