ఊగిసలాటలో మార్కెట్లు - Stock markets are in Volatile mood
close

Published : 16/04/2021 09:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఊగిసలాటలో మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం స్పల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. కొద్ది సేపటికే అమ్మకాలు వెల్లువెత్తడంతో నష్టాల్లోకి జారుకున్న సూచీలు తిరిగి పుంజుకొని లాభాల్లోకి వచ్చాయి. ఇలా ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే మార్కెట్లు ఊగిసలాట ధోరణి కనబరుస్తున్నాయి. ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్‌ 55‌ పాయింట్ల లాభంతో 48,859 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 31 పాయింట్లు ఎగబాకి 14,613 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 74.82 వద్ద కొనసాగుతోంది. అమెరికా మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి. 

టీసీఎస్‌, సిప్లా, ఓఎన్‌జీసీ, విప్రో లిమిటెడ్‌, అదానీ పోర్ట్స్‌ షేర్లు లాభాల్లో పయినిస్తుండగా.. ఐషర్ మోటార్స్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్‌, మారుతీ సుజుకీ ఇండియా, ఇండ్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నేడు మైండ్‌ట్రీ, డెన్‌ నెట్‌వర్క్స్‌, జీటీపీఎల్‌ హాత్‌వే, ఎంఎంటీసీ, ఏఏఆర్‌ కమర్షియల్‌ కంపెనీల త్రైమాసిక ఫలితాలు వెలువడనున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని