గూగుల్‌ ఉద్యోగులకు ‘హైబ్రిడ్‌’ పనివిధానం
close

Published : 07/05/2021 01:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గూగుల్‌ ఉద్యోగులకు ‘హైబ్రిడ్‌’ పనివిధానం

ఏడాది చివరకు ప్రణాళికలు

దిల్లీ: గూగుల్‌ ఉద్యోగులు సరికొత్త పని విధానంలోకి మారనున్నారు. మూడు రోజులు కార్యాలయంలో, మరో రెండు రోజులు ‘వారు అత్యుత్తమంగా పనిచేసే చోట’ ఉంటారని గూగుల్‌, ఆల్ఫాబెట్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ పేర్కొన్నారు. మొత్తం సిబ్బందిలో 20 శాతం మంది మాత్రం ఎప్పటిలాగే ఇంటి నుంచే పనిచేస్తారు. ఈ ఏడాది చివర్లో తిరిగి పునః ప్రారంభం కానున్న కార్యాలయాలకు 60 శాతం సిబ్బంది వారంలో కొద్ది రోజుల పాటు వస్తారని పిచాయ్‌ పేర్కొన్నారు. ‘ఆఫీసులో ఏ రోజుల్లో రావాలన్నది బృందాలు నిర్ణయిస్తాయి. వారి పనులకు సంబంధించి వారంలో మూడు రోజుల కంటే ఎక్కువ సైట్‌లో ఉండాల్సి రావొచ్చు’ అని అన్నారు. అయితే బృందం అవసరాలకు, పని తీరు ఆధారంగా పూర్తిగా రిమోట్‌ (ఆఫీసుకు దూరంగా) ప్రాంతం నుంచి పనిచేసే అవకాశాన్ని ఉద్యోగులకు ఇస్తున్నట్లు కూడా వివరించారు. 2021 తొలి త్రైమాసిక ఫలితాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా గూగుల్‌కు 1,39,995 మంది ఉద్యోగులున్నారు. ఏ దేశంలో ఎంత మంది ఉన్నారన్నది తెలియనప్పటికీ.. భారత్‌లో 4000 మందికి పైగా ఉండొచ్చు. ‘60% మంది వారంలో కొద్ది రోజులు కార్యాలయానికి; మరో 20 శాతం మంది కొత్త కార్యాలయాలకు; మరో 20% మంది ఇంటి నుంచి పనిచేస్తార’ని ఆయన వివరించారు. కరోనా నుంచి కోలుకునేందుకు అదనంగా ‘రీసెట్‌’ రోజులను ఈ ఏడాది కూడా ఇవ్వనున్నట్లు కంపెనీ వివరించింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని