39% పెరిగిన టెక్‌ మహీంద్రా లాభం
close

Published : 30/07/2021 04:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

39% పెరిగిన టెక్‌ మహీంద్రా లాభం

దిల్లీ: టెక్‌ మహీంద్రా జూన్‌ త్రైమాసికంలో రూ.1,353.2 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన నికర లాభం రూ.972.3 కోట్లతో పోలిస్తే ఇది 39.2 శాతం అధికం. ఆదాయం రూ.9,106.3 కోట్ల నుంచి 12 శాతం పెరిగి రూ.10,197.6 కోట్లకు చేరింది. డాలర్‌ ప్రాతిపదికన నికర లాభం 42.2 శాతం పెరిగి 183.2 మి.డాలర్లకు, ఆదాయం 14.6 శాతం పెరిగి 1,383.6 మిలియన్‌ డాలర్లకు చేరింది. ఉద్యోగులు 5,209 మంది పెరిగి 1,26,263కు చేరారు. 2021 జూన్‌ 30 నాటికి కంపెనీ వద్ద నగదు నిల్వలు 1,818.2 మిలియన్‌ డాలర్ల మేర ఉన్నట్లు ముఖ్య ఆర్థిక అధికారి మిలింద్‌ కుల్‌కర్ణి వెల్లడించారు. ‘మా కీలక విపణులు, పరిశ్రమ రంగాల్లో ఈ త్రైమాసికంలో మంచి పనితీరు కనబరిచామ’ని టెక్‌ మహీంద్రా ఎండీ, సీఈఓ సీపీ గుర్నాని తెలిపారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని