వొడాఫోన్‌ ఐడియాకు ఢోకా లేదు
close

Published : 23/09/2021 01:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వొడాఫోన్‌ ఐడియాకు ఢోకా లేదు

సీఈఓ రవీందర్‌ టక్కర్‌

దిల్లీ: వొడాఫోన్‌ ఐడియా భవిష్యత్‌కు ఢోకా లేదని, పెట్టుబడిదార్లతో నిధుల సమీకరణ ఒప్పందాన్ని కుదుర్చుకుంటామని సంస్థ సీఈఓ రవీందర్‌ టక్కర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ఉపశమన చర్యలు కంపెనీకి దన్నుగా నిలుస్తాయని అన్నారు. ప్రస్తుతం వొడాఫోన్‌ ఐడియాకు రూ.1.91 లక్షల కోట్ల నికర రుణం ఉండగా, ప్రభుత్వానికి రూ.1.68 లక్షల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. టెలికాం రంగంలో కనీసం మూడు ప్రైవేటు సంస్థలు ఉండే విధంగా ప్రభుత్వం తోడ్పాటు ఇవ్వడాన్ని మదుపర్లు గమనిస్తున్నారని, ప్రభుత్వ బకాయిలు చెల్లించడం కంటే వ్యాపార విస్తరణకు పెట్టుబడులు అవసరమని టక్కర్‌ అన్నారు. ప్రభుత్వ ఉపశమన ప్యాకేజీతో కొంత వరకు భయాలు తొలిగాయని పేర్కొన్నారు.


ఎఫ్‌డీఐ పెట్టుబడుల్లో 112 శాతం వృద్ధి

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌- జులైలో దేశీయ ఈక్విటీల్లోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐలు) 20.42 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.1.5 లక్షల కోట్లు)గా నమోదైనట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ గణాంకాలు స్పష్టం చేశాయి. ఏడాది క్రితం ఇదే సమయంలో నమోదైన 9.61 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే, ఈసారి 112 శాతం పెరిగాయి. ఇక మొత్తం ఎఫ్‌డీఐలు 27.37 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఏడాది క్రితం ఇవి 16.92 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. మొత్తం ఎఫ్‌డీఐల్లోకి ఈక్విటీ పెట్టుబడులు, మళ్లీ పెట్టుబడి పెట్టిన ఆదాయాలు, ఇతర మూలధనం వంటివి వస్తాయి. సమీక్షిస్తున్న కాలంలో అత్యధిక ఎఫ్‌డీఐలు వాహన రంగం (23 శాతం)లోకి వచ్చాయి. కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ హార్డ్‌వేర్‌ (18 శాతం), సేవల రంగం (10 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రాష్ట్రాల వారీగా చూస్తే కర్ణాటక (45 శాతం) అగ్రస్థానంలో ఉండగా, తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర (23 శాతం), దిల్లీ (12 శాతం) నిలిచాయి.Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని