ఎయిరిండియా ప్రైవేటీకరణతో రోజుకు రూ.20 కోట్లు ఆదా!
close

Published : 18/10/2021 01:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎయిరిండియా ప్రైవేటీకరణతో రోజుకు రూ.20 కోట్లు ఆదా!

దీపమ్‌ కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే

దిల్లీ: ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న ఎయిరిండియా విమానాలను నడపడానికి రోజుకు రూ.20 కోట్ల మేర పన్ను చెల్లింపుదార్ల సొమ్మును ప్రభుత్వం కేటాయిస్తోందని, ఇప్పుడు ఈ సంస్థను టాటాలకు విక్రయించడంతో ఆ మేరకు మిగిలినట్లే అని ప్రభుత్వ పెట్టుబడులు, ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్‌) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే వెల్లడించారు. ‘కొత్త యజమానికి (టాటాలు) ఎయిరిండియా నిర్వహణ అంత సులభమేమీ కాదు. విమానాల పునరుద్ధరణకు రూ.కోట్లలో వెచ్చించాల్సి ఉంటుంది.  ఎయిరిండియా ఉద్యోగుల్ని ఏడాది వరకు టాటాలు ముట్టుకోడానికి వీల్లేదు. ఆ తర్వాతే స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్‌ఎస్‌) ప్రకటించొచ్చు. టాటాలకు లభించిన ఏకైక ప్రయోజనం ఏదైనా ఉందంటే.. ఏళ్లతరబడి ఎయిరిండియాకు నష్టాల రూపంలో పేరుకున్న అప్పుల్ని కొంతమేరకే తీసుకోవడం’ అని తుహిన్‌ వివరించారు. ఆగస్టు 31 నాటికి ఎయిరిండియాకు రూ.61,562 కోట్ల అప్పులున్నాయి. ఇందులో 75 శాతాన్ని (రూ.46,262 కోట్లు) ఏఐఏహెచ్‌ఎల్‌కు బదిలీ చేయగా, మిగిలిన అప్పుల్ని (రూ.15,300 కోట్లు) టాటాలు తీసుకున్నారు. మరో రూ.2,700 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని